Posani Krishna murali : రూమ్ లో అమ్మాయిలను పెట్టుకున్నానని నన్ను ఇంట్లో నుండి గెంటేశారు…: పోసాని కృష్ణ మురళి

0
138

Posani Krishna Murali : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి. నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొచ్చే పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత ‘గాయం’ నాగార్జున ‘రక్షణ’ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. ఇక రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

పక్కలేసానని నన్ను గెంటేసారు…

పోసాని గారు ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పొట్టకూటి కోసం ఎవరైనా రైటర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలని అనుకున్నారట. అలా పోసాని గారు పరుచూరి బ్రదర్స్ వద్దకు వెళ్లడం అక్కడ పనికి చేరడం జరిగింది. అక్కడ ఉన్నపుడు ఇంట్లోనే ఉంటూ పరుచూరి బ్రదర్స్ కి సేవలను చేస్తూ రైటర్ గా మెలకువలు నర్చుకుంటున్న సమయంలో మంచి శిష్యుడుగా మెలుగుతున్న సమయంలో హీరో రవితేజ బాగా పరిచయం ఉండటంతో అలా అతని తమ్ముడు కూడా పరిచయం ఉన్నాడట. పరుచూరి వెంకటేశ్వర రావు కొడుకు ద్వారానే వాళ్ళు పరిచయం అయ్యారట. అలా రవితేజ తమ్ముడు ఒక అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకోడానికి చెన్నై రాగా వెంకటేశ్వర రావు గారి అబ్బాయి పోసాని వద్దకు సహాయం కోసం వస్తే పోసాని తన రూమ్ లో ఆశ్రయం ఇచ్చాడట.

ఈ వార్త పరుచూరి గోపాల కృష్ణ గారికి ఎవరో తప్పుగా చెప్పడంతో రూమ్ కి అమ్మాయిని తెచ్చుకున్నాడనే అనుమానంతో పోసాని ని బాగా తిట్టి అక్కడి నుండి పంపించేశారట. నిందతో అక్కడినుండి వెళ్ళవలసి రావడం తనకు వివరణ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదనే బాధ చాలా రోజులు ఉందట. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళకూడదు నా మొహం వాళ్లకు చూపించకూడదు అని నిర్ణయం తీసుకున్నారట. మొదటి నుండి తనను అక్కున చేర్చుకున్న గోపాలకృష్ణ గారు ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అనుమానించడంతో బాగా బాధపడ్డాను, నిజం మళ్ళీ తెలుసుకున్నా వారిని కలసి ప్రయత్నం చేయలేదంటూ చెప్పారు పోసాని.