Preethi Reddy : తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ నుండి మేడ్చల్ ఎమ్మెల్యే గా ఉన్న మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అధినేత మల్లారెడ్డి గారి గురించి పరిచయం అక్కర్లేదు. రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఆయన తెలుసు. పాలు అమ్మి జీవితం మొదలు పెట్టిన ఆయన నేడు రాజకీయవేత్తగా అలాగే విద్యావేత్తగా సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఆస్తుల మీద ఐటి దాడుల నేపథ్యంలో ఆయన పాల వ్యాపారం నుండి నేను కస్టపడ్డాను అంటూ చెప్పిన స్పీచ్ బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఆ స్పీచ్ గురించి మీమ్స్ అలాగే రీల్స్ రావడం జరిగింది. ఇక ఆయన సక్సెస్ గురించి కుటుంబంకి ఇచ్చే విలువ గురించి ఆయన కోడలు మల్లారెడ్డి గ్రూప్ అఫ్ ఇస్టిట్యూషన్స్ ఎండి అలాగే మల్లారెడ్డి సైన్స్ సిటీ చైర్మన్ ప్రీతిరెడ్డి తొలిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అమ్మ నాన్న వాళ్ళే…
మల్లారెడ్డి గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కాగా కొడుకు భద్రా రెడ్డి డాక్టర్. ఆయన ప్రేమించి ఆయనలాగే వైద్యవృతిలో ఉన్న ప్రీతి గారిని పెళ్లి చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన ప్రీతి గారు వృత్తి రీత్యా డాక్టర్ అలాగే నాట్యకారిని కూడా. ఆమె వేదిక మీద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇక ప్రస్తుతం ప్రీతి రెడ్డి గారు మల్లారెడ్డి గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ కు ఎండి గా వ్యవహారిస్తున్నారు. అలాగే మల్లారెడ్డిగారి హాస్పిటల్స్ ను కూడా ఆవిడే పర్యవేక్షిస్తున్నారు.

పెళ్లయ్యాక అత్తమమాలు ఇద్దరూ అమ్మానాన్నలుగా నన్ను చూసుకుంటున్నారు అంటూ ప్రీతిరెడ్డి చెబుతున్నారు. అమ్మ అనే అత్తమ్మను పిలుస్తానని ప్రీతిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఏ ఆడపిల్లకైనా ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి అవసరం చాలా ఉంటుంది. నా కన్నతల్లి 14 ఏటనే మరణించారు. ఆ లోటు లేకుండా ప్రెగ్నెన్సీ సమయంలో అత్తమ్మ చూసుకున్నారు. నోరు తెరిచి అడగక ముందే అన్ని అమర్చి పెట్టేవారు, నాకు పురుడుకు నేను పుట్టింటికి వెళ్ళలేదు, వెళ్లే అవసరం నాకు అత్తింటి వాళ్ళు ఇవ్వలేదు. చాలా బాగా చూసుకున్నారు అంటూ చెప్పారు ప్రీతి రెడ్డి.