Producer Adhisheshagiri Rao : రమేష్ బాబు ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాడు….మరణించడానికి కారణం….: నిర్మాత అధిశేషగిరి రావు

0
119

Producer Adhisheshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అధిశేషగిరి రావు గారు. అన్న కృష్ణ గారికి తోడుగా ప్రతి విషయంలోనూ ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. పద్మాలయ స్టూడియోస్ కట్టాక ఆ స్టూడియో బాధ్యతలను ఆయనే చూసుకుంటూ కృష్ణ గారి ఓన్ ప్రొడక్షన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. నటనలో కృష్ణ గారు నిర్మాణ రంగంలో అధిశేష గిరి రావు గారు అలాగే ప్రొడక్షన్ లో హనుమంత రావు గారు ఇలా ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలో ఉండేవారు. ఇక కృష్ణ గారి కుటుంబంలో గతేడాది వరుసగా ముగ్గురు మరణించారు. రమేష్ బాబు గారు మరణించిన కొద్ది నెలలకు ఇందిర గారు ఆ తరువాత కృష్ణ గారు మరణించారు. అలా వరుస విషాదాల తరువాత మొదటి సారి ఇంటర్వ్యూ లో మాట్లాడారు అధిశేషగిరి రావు గారు. తన అన్న కొడుకులైన రమేష్, మహేష్ ల గురించి మాట్లాడారు.

రమేష్ సినిమాలను చేయకపోడానికి కారణం….

చిన్నప్పటి నుండి రమేష్, మహేష్ ఇద్దరు సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ చూపేవారు. మహేష్ ఎవరినైనా బాగా అనుకరిస్తాడు మిమిక్రి కూడా చేస్తాడు.ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇక రమేష్ బాబుకి కూడా బాగా సినిమాల మీద ఆసక్తి అంటూ చెప్పారు. అయితే తాను హీరోగా నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ అవడంతో ఇక సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పి ప్రొడ్యూసర్ అవుతానని చెప్పాడు.

సినిమా హిట్ ఫెయిల్యూర్ మెంటల్ స్ట్రెస్ తాను తీసుకోలేకపోయాడు అందుకే వాటి నుండి బయటికి వచ్చేసాడు. ఇక తాను కార్డియక్ అరెస్టు అవడం వల్ల మరణించాడు. అప్పటికే ఒకసారి స్టంట్స్ పడ్డాయి. మరోసారి కార్డియాక్ అరెస్టు అవడం వల్ల కాపాడుకోలేక పోయమని రమేష్ బాబూ గురించి బాబాయ్ అధిశేషగిరిరావు గారు తెలిపారు.