Producer Chittibabu : ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ లో హీరోల కథల ఎంపిక విధానం మారిపోయింది. అలాగే చూసే ప్రేక్షకుడు కూడా కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నాడు. అందుకే కథల ఎంపికలో హీరోలు ఎంత జాగ్రత్త పడుతున్నారో అలాగే స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్లు అంత పక్కాగా ఉంటున్నారు. అసలే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న టాలీవుడ్ లో కథ కథనం విషయంలో కొంచం తప్పు దొర్లినా కోట్లు ఆవిరి అయిపోవడం ఖాయం. ఏమాత్రం మొహమాట పడకుండా నచ్చని టెక్నిషియన్స్ ను మార్చుకుని నచ్చిన వాళ్ళతో వెళ్తున్నారు. తాజాగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ గుణ శేఖర్ ను తప్పించారు రాణా దగ్గుబాటి. ఈ విషయం గురించి నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు.

హిరణ్య కశ్యప నుండి గుణ శేఖర్ ఔట్…
గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా చెప్పే హిరణ్య కశ్యప కథ నుండి ఆయనను తొలగించడం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రాణా సొంతంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా నుండి గుణ శేఖర్ ను తొలగించి త్రివిక్రమ్ ను పెట్టుకున్నారు. ఇక ఈ విషయం మీద చిట్టిబాబు మాట్లాడుతూ డైరెక్టర్ గా గుణ శేఖర్ హిస్టారికల్ సబ్జెక్ట్స్ ను డీల్ చేయడంలో విఫలమయ్యారు.

ఆయన రుద్రమ దేవి సినిమా తీసి అందులో రుద్రమ దేవిని హైలైట్ చేశారో లేక గోన గన్నారెడ్డిని హైలైట్ చేసారో కార్థం కాలేదు. ఇక శాకుంతలం సినిమాలో ఆయన క్యారెక్టర్ కి తగ్గట్టు ఎవరినీ తీసుకోలేక పోయారు అంటూ చెప్పారు. అందుకే భారీ బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక సబ్జెక్టు మీద పట్టు ఉన్న వ్యక్తిని డైరెక్టర్ గా పెట్టుకుంటే మంచిది అనే ఉద్ధేశంతో రాణా ఆ నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆయన అభిప్రయపడ్డారు.