Producer DVV Danayya : ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుకల్లో నేను కనిపించకపోడానికి కారణం ఇదే… 80 కోట్ల ఖర్చా… నోటికొచ్చినట్లు మాట్లాడకండి…: నిర్మాత డివివి దానయ్య

0
260

Producer DVV Danayya : దాసరి వీర వెంకట దానయ్య అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ డివివి ఎంటర్టైన్మెంట్స్ దానయ్య అనగానే దానయ్యగారు ఆయన నిర్మించిన సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయన జంబలకిడి పంబ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చాలా సినిమాలకు నిర్మాతగా సినిమాలను నిర్మించినా ప్రస్తుతం నిర్మించిన పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆస్కార్ వేడుకల్లో కానీ గోల్డెన్ గ్లోబ్ సంబరాల్లో కానీ నిర్మాత ఊసే లేకపోవడం ఆందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక ఈ విషయాల మీద దానయ్య క్లారిటీ ఇచ్చారు.

అందుకే ఆస్కార్ వేడుకలకు దూరం… 80 కోట్లు నేనైతే పెట్టలేదు…

దానయ్య గారు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి మాట్లాడుతూ అవన్నీ ప్రచారలే అంటూ కొట్టి పడేసారు. నేను బయటికి వెళ్ళాడ్సనికి పబ్లిసిటీకి దూరంగా ఉంటాను అందుకే ఆస్కార్ ప్రమోషన్స్ లో కూడా కనిపించలేదు. అంతే కానీ నన్నెవరూ తక్కువగా చూడలేదు. రాజమౌళి గారు 2006 లో ఇచ్చిన చిన్న అడ్వాన్స్ కు కట్టుబడి నాతో పాన్ ఇండియా సినిమా తీశారు.

ట్రిపుల్ ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి నేను నిర్మాతను ఇంతకంటే ప్రాధన్యత నాకేం కావాలి అంటూ మాట్లాడారు. ఇక ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారు అనే వార్తల మీద మాట్లాడుతూ సినిమాకు లాభాలే అంత రావు మళ్ళీ 80 కోట్లు ఎలా పెడతా నేనైతే రూపాయి పెట్టలేదు. రాజమౌకి గారు పెట్టారో లేదో నాకు తెలియదు అంటూ క్లారిటీ ఇచ్చారు.