Renjarla Rajesh : అంటరానితనం ఇంకా ఉంది… షాకింగ్ కామెంట్స్ చేసిన రెంజర్ల రాజేష్…!

0
278

Renjarla Rajesh : అయ్యప్ప స్వామి మీద అనుచిత వ్యాఖ్యలను చేస్తూ ఫేమస్ అయిన నాస్తిక వాది బైరి నరేష్. ఆయనకు మద్దతు పలుకుతూ సరస్వతి దేవి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రెంజర్ల రాజేష్. నిమ్న కులాలను వారి మీద జరుగుతున్న అన్యాయాలు, అంటరానితనం మీద పోరాడుతున్నామని చెప్పే రెంజర్ల రాజేష్ తనను తాను హేతువాదిగా చెబుతాడు. దేవుడి మీద నరేష్ చేసిన వాఖ్యలు తనకి నచ్చలేదని చెప్పే రాజేష్ నిమ్న కులాల మీద దాడులు గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అంటరానితనం ఇంకా ఉంది…

నిమ్న కులాల మీద దాడులను గురించి పోరాడుతున్నానని చెప్పే రెంజర్ల రాజేష్ ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో అంటరానితనం కనిపిస్తుంది, ఎవరికి అనుమానాలు ఉన్నా చూపిస్తా రండి అంటూ మాట్లాడారు. అగ్ర కులాల వాళ్ళ దాడులకు ఇంకా నిమ్న కులాలు బాధింపబడుతున్నాయి అంటూ తెలిపారు. అలాంటి సంఘటనలను మీడియా కూడా చూయించడం లేదంటూ చెప్పారు.

ఇప్పటికీ వినాయకుడిని మాదిగ వీధిలో తిప్పితే దేవుడు కూడా మైల పడిపోయాడని కొన్ని చోట్ల వేరే విధుల్లోకి రానివ్వలేదు. తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న ఇలాంటి అకృత్యాల గురించి ఎవరూ చర్చించరు అంటూ కుల నిర్మూలన జరిగితేనే దేశం బాగుపడుతుందని వివరించారు. మనుషులంతా ఒక్కటే, కులం మతం లేదు అనే భావన అందరిలో కలగాలనే నేను ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పారు రాజేష్.