Shanoor Sana begum : ఆ విషయంలో కులం మతం అడ్డు రాలేదు… ఒక ముస్లిం, క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే తప్పేంటి…: షానూర్ సన బేగం

0
216

Shanoor Sana begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన బేగం. మోడల్ గా అడుగుపెట్టిన ఆమె ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాలో బెనర్జీ వైఫ్ క్యారెక్టర్ చేసి తెలుగులో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక చక్రవాకం సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన సన అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన లైఫ్ ని వ్లాగ్స్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ అన్ని విశేషాలను పంచుకున్నారు.

అమ్మవారిగా చేసినపుడు…

సన గారు ఎన్నో పాత్రలు చేసినా అందులో బాలకృష్ణ గారి సినిమాలో నటించిన అమ్మవారి పాత్ర అలాగే శ్రీరామ రాజ్యం సినిమాలో కైకేయిగా నటించి మెప్పించారు. అయితే ఒక ముస్లిం అయ్యుండి అమ్మవారి పాత్రలో నటించినపుడు ఎలా అనిపించింది అనే ప్రశ్న ఎదురైనపుడు ఆ అమ్మవారే తన పాత్ర నేను వేయాలి అనుకుంది అందుకే ఆ పాత్ర అంత బాగా వచ్చింది. నాకు ఏ రోజూ కుల మాతాల పట్టింపులు లేవు.

మా ఇంట్లో కూడా అందరూ మతం గురించి పెద్దగా ఆలోచించారు. నా తండ్రి క్రిస్టియన్, తల్లి ముస్లిం కానీ నేను ముస్లిం లాగా పెరిగాను. ఇక నా పిల్లలు నా భర్త ఏనాడూ ముస్లిం అని చెప్పరు. ఇండియన్ ముస్లిమ్ అనే చెబుతాం. నాకు మతం అంటూ మాట్లాడటం రాదు, అందరం ఒకటే అనే భావన నాలో ఉంది అంటూ సన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.