Shiva Shakthi Datta : ఆయనను మోసం చేసి సినిమాల్లోకి వచ్చాను… డైరెక్షన్ అంటే నాకు ఇష్టం…: శివ శక్తి దత్త

0
88

Shiva Shakthi Datta : సినిమా తీయాలనే కోరికతో చెన్నైకి వచ్చిన శివ శక్తి దత్త గారు ఇప్పటి వరకు ఆ అవకాశం రాక ఎదురుచూశారు. ప్రస్తుతం ఆయన వయసు 91సంవత్సరాలు అయినా కూడా ప్రస్తుతం ‘తిరుమల నాయక’ అనే సినిమాకు దర్శకుడిగా చేస్తున్నారు. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన ఆయన ఎన్నో పెయింటింగ్స్ వేశారు. శివ శక్తి దత్త గారి సోదరుడు విజయేంద్ర ప్రసాద్ గారు కాగా ఆయన కొడుకు కీరవాణి, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి రాజమౌళి. ఇక శివ శక్తి దత్త గారికి నలుగురు సోదరులు కాగా సినిమా మీద ఆసక్తితో ఆయన చెన్నై కి వచ్చారు. ఆస్తులను పోగొట్టుకున్నా సినిమా ఇండస్ట్రీలోనే నిలబడ్డారు. ఇక 91ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు తిరుమల నాయక అనే సినిమాను డైరెక్షన్ చేస్తూ ఆయన చిరకాల కోరికను నెరవేర్చుకుంటున్నారు.

ఆయనను మోసం చేసి సినిమాల్లోకి వచ్చాను…

శివశక్తి దత్త గారి అసలు పేరు సుబ్బారావు కాగా ఆయన తాతగారి పేరు అవ్వడం వల్ల ఎవరూ పిలిచేవారు కాదట. అలా బాబు రావు అంటూ పిలిచినా చెన్నై లో చదువుకోడానికి వెళ్ళినపుడు బాబ్జి గా పేరును మార్చుకున్నారట శివ శక్తి దత్త గారు. ఇక ఒక ఏడాది చెన్నై లో చదువుకున్నా అక్కడ నచ్చక ముంబై వెళ్లి జేజే స్కూల్ లో చేరారట.

అక్కడ కమలేష్ గా పేరు మార్చుకుని ముంబై జూహి బీచ్ వద్ధ బాలీవుడ్ సెలబ్రిటీస్ వస్తుండటం వల్ల వారితో పరిచయాలు పెంచుకున్నారట. ఐదేళ్లయ్యాక అక్కడి నుండి ఇంటికి వచ్చిన ఆయన సినిమాల్లోకి వెళతానని చెబితే తండ్రి ఒప్పుకోలేదు. ఇక ఆయనకు చెప్పకుండా చెన్నై లో ఆర్టిస్ట్ గా ఉంటానని చెప్పి సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించారట. అలా తండ్రిని మోసం చేసి సినిమాల్లోకి వచ్చానంటూ శివ శక్తి దత్త గారు తెలిపారు.