Sivabalaji & Madhumitha : ఎంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్న భార్య భర్తల మధ్య గొడవలు సహజం అయితే వాటిని ఎంత వరకు తీసుకెళ్తామనే దగ్గరే వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో అనేది ఆధారపడి ఉంటుంది. చిన్న విషయాలకే సర్దుకుపోలేక విడిపోతున్న ఈ కాలంలో సెలబ్రిటీ జంట అయిన మధుమిత శివ బాలాజీ లు ప్రేమించి పెళ్లి చేసుకుని పెళ్ళైన మొదట్లో బాగా గొడవలు పడ్డారట. అయితే విడిపోవాలని అనుకోలేదు. వారి గొడవలను కాలానికి వదిలేసారు. అందుకే నేడు హ్యాపీ ఫ్యామిలీగా నిలిచారు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న వారిద్దరూ వారి కుటుంబ విషయాలను వారి వైవాహిక జీవితం గురించి మాట్లాడారు.

కొడుకు పుట్టాక గొడవలు…
సినిమాలో చేసి మనసులు కలిసి ప్రేమించుకున్న శివ, మధు ఇద్దరూ జాతకాలు కలవలేదని తొలుత బ్రేక్ అప్ అయ్యారు. కానీ వారిమధ్య ఉన్న ప్రేమ మళ్ళీ వాళ్లను ఒక్కటి చేసింది. అలా కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్ళై కొడుకు పుట్టాక గొడవలు పడ్డారట.

ప్రేమించుకున్నపుడు బయట కలవడం వెళ్లిపోవడం కానీ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినపుడు అభిప్రాయ బేధాలు రావడం, మూడో వ్యక్తి వారి మధ్య రావడంతో గొడవలు జరిగాయట. అలా విడిపోదామా అనేంతగా కొట్టుకున్న ఇద్దరూ ఆ పని చేయలేదు. కేవలం వారి గొడవను వదిలేసారు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్న వాళ్ళు అప్పటి గొడవలను తలుచుకుంటే నవ్వొస్తుంది అంటూ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.