Featured
Srija Konidela: ఏడుస్తుంటే ఓదార్చారు.. నేను మాట్లాడితే విన్నారు.. ఎమోషనల్ అయినా శ్రీజ!
Published
2 years agoon
By
lakshanaSrija Konidela: శ్రీజ కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తెగా ఈమె అందరికీ ఎంత సుపరిచితమే. ఈమె కాలేజీ చదువుతున్న రోజులలోనే శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందంటూ ఏకంగా తన కుటుంబం పై పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇలా ఒక్కసారిగా వార్తలలో నిలిచిన శ్రీజ అనంతరం తన భర్తకు విడాకులు ఇచ్చారు.
ఇలా శిరీష్ భరద్వాజ్ తో విడిపోయిన శ్రీజ తిరిగి తన తండ్రి సూచించిన కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపారు.ఇలా మొదటి భర్తకు ఒక కుమార్తె రెండవ భర్తకు మరొక కుమార్తెకు జన్మనిచ్చిన శ్రీజ తన బిడ్డలతో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు.అయితే గత కొంతకాలం నుంచి శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోయారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో మరోసారి శ్రీజ వార్తల్లో నిలిచారు.
ఇక వీరిద్దరికీ విడాకులు జరిగినప్పటికీ ఈ విషయాన్ని మెగా కుటుంబం అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. ఇక కళ్యాణ్ దేవ్ దూరం కావడంతో శ్రీజ ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తనకి తన కుటుంబం, స్నేహితులు ఎంతో అండగా నిలిచారు.ఇక రాంచరణ్ తననీ వెకేషన్ లకు తీసుకెళ్తూ వారిని ఎంతో సంతోషంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తున్నారు.
Srija Konidela: కష్ట సమయంలో అండగా నిలిచారు…
ఈ క్రమంలోనే శ్రీజ ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కష్ట సమయంలో నాకు ప్రతి ఒక్కరు ఎంతో అండగా నిలిచారు. నేను ఏడిస్తే ఓదార్చారు. నేను నవ్వితే సంతోషించారు.. నేను మాట్లాడేటప్పుడు మీరు విన్నారు.. ఇలా కష్ట సమయాల్లో తనకు అండగా నిలిచి తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన కుటుంబ సభ్యులు స్నేహితులకు కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
You may like
Kalyan Dev: నీరాకతో ఎంతో ప్రత్యేకం.. కూతురు పట్ల ఎమోషనల్ పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్!
Raviteja: హీరో రవితేజ కూడా సీరియల్లో నటించారు అనే విషయం మీకు తెలుసా… ఏ సీరియల్ అంటే?
Kalyan Dev: ఆమె సీమంతపు వేడుకలలో కళ్యాణ్ దేవ్.. కుటుంబం పెద్దదవుతుందంటూ షాకింగ్ పోస్ట్?
Mega Family: మెగా అల్లుళ్ళుగా ఉండాలంటే వారు పెట్టే కండిషన్లకు ఒప్పుకోవాల్సిందేనా… లేకుంటే విడాకులేనా?
Sreeja: శ్రీజ కోసం కోట్ల విలువచేసే ఆస్తులను ఇచ్చిన మెగాస్టార్…?
Kalyan Dev: మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసినా కళ్యాణ్ దేవ్… అవే మధుర క్షణాలు అంటూ?
Featured
Nag Aswin: నాగ్ అశ్విన్ కి ఆ హీరోయిన్ అంటే అంత సెంటిమెంట్ నా.. ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ?
Published
7 hours agoon
26 June 2024By
lakshanaNag Aswin: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు.
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తద్వారా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ నాగార్జునకు ఒక హీరోయిన్ అలాగే ఒక హీరో హిట్ సెంటిమెంట్ గా మారారని అందుకే తన సినిమాలలో వీరిద్దరిని కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.
నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నారంటే తప్పనిసరిగా విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ వీరిద్దరూ ఉండేలా ఈయన జాగ్రత్త పడుతున్నారట. నాగ్ అశ్విన్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి కల్కి ఈ మూడు సినిమాలలో వీరిద్దరూ నటించారు నటించిన ఇదివరకు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి అందుకే ఈ కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయర్ ఉండేలా అశ్విన్ జాగ్రత్త పడ్డారు.
విజయ్ దేవరకొండ.. మాళవిక నాయర్..
ఈ హిట్ సెంటిమెంట్ ప్రకారం ఈయన కల్కి సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకోబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు కానీ ఈ సినిమాకు మాత్రం ఫ్రీ బుకింగ్స్ భారీగా జరగడంతో సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Featured
Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో పవన్ … అందుకే దీక్ష వేశారా?
Published
7 hours agoon
26 June 2024By
lakshanaPawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో బాధ్యతలను తీసుకొని పెద్ద ఎత్తున అధికారులతో సమావేశాలు సమీక్షలను నిర్వహిస్తూ అన్ని శాఖలపై ఆరా తీయడమే కాకుండా అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను క్షణాలలోని పరిష్కరిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా అయిన పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్ష వేశారు. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో ఈ దీక్ష గురించి పెద్ద ఎత్తున అందరూ తెలుసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకోవడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజులపాటు వేయబోతున్నారు.
11 రోజుల దీక్ష..
ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకాకుండా కేవలం పండ్లు, ద్రవాలను మాత్రమే తీసుకోబోతున్నారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే ఎన్నికలలో తన విజయం కోసమే ఈయన అమ్మవారికి మొక్కుకున్నారని అయితే ఎన్నికలలో విజయం సాధించడంతో అమ్మవారి మొక్కు తీర్చడం కోసం ఇలా దీక్ష వేశారని తెలుస్తోంది.
Featured
Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?
Published
1 day agoon
25 June 2024By
lakshanaPuri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.
ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.
ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.
బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
Nag Aswin: నాగ్ అశ్విన్ కి ఆ హీరోయిన్ అంటే అంత సెంటిమెంట్ నా.. ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ?
Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో పవన్ … అందుకే దీక్ష వేశారా?
ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?
Tollywood: గన్నవరం చేరుకున్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్.. పవన్ తో కీలక భేటీ?
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
Trisha: ఒక్క రోజైనా అలా బ్రతకాలని ఉంది.. వింత కోరికను బయట పెట్టిన త్రిష?
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
Trending
- Featured2 weeks ago
Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..
- Featured4 weeks ago
Trisha: ఒక్క రోజైనా అలా బ్రతకాలని ఉంది.. వింత కోరికను బయట పెట్టిన త్రిష?
- Featured4 weeks ago
Pallavi Prashanth: జల్సాలకు అలవాటు పడిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… మాట తప్పినట్లేగా?
- Featured4 weeks ago
Balakrishna: స్టేజ్ పైన హీరోయిన్ ను తోసేసిన బాలయ్య.. ఘాటుగా స్పందించిన వైసీపీ పార్టీ?
- Featured3 weeks ago
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
- Featured4 weeks ago
Chiranjeevi: మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న చిరంజీవి.. సంతోషంలో మెగా ఫాన్స్?
- Featured4 weeks ago
Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన ఎంతో తెలుసా… సాఫ్ట్ వేర్స్ కూడా వేస్టే!
- Featured2 weeks ago
Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..