తలచుకోగానే నోట్లో నీరు ఊరే పండు సీతాఫలం. ఇది చాల తక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటె ఇది ఒక సీజనల్ ఫ్రూట్. ఫ్రూట్ లవర్స్ వీటికోసం సెప్టెంబర్ నుండి ఎదురుచూస్తూ ఉంటారు. అంత అమోఘమైన రుచిని కలిగి ఉంటుంది సీతాఫలం. అంతేకాదు ఈ పండు అందించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అమోఘమే. ఈ కాలంలో విరివిగా దొరికే సీతాఫలం రుచిని ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. పోషక విలువలు అధికంగా ఉండే సీతాఫలం పళ్ళు వర్షాకాలం ప్రారంభమవగానే మార్కెట్లో కనబడతాయి. వీటిని తిన్న వెంటనే శక్తినిస్థాయి. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పరగడుపున ఈ పండును తినకూడదు. సీతాఫలం గుజ్జును తేనెతో కలిపి తింటే బరువు పెరుగుతారు. సీతాఫలం వలన ఈ ప్రయోజనాలే కాకుండా ఇంకా చాలా ప్రజోజనాలున్నాయి. ముఖ్యంగా అవి మన ఆరోగ్యానికి సంబంధించినవే కావడం ఈ పండు విశేషం. మరి ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సీతాఫలం తింటుంటే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్‌ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలోని ఇన్సులిన్‌ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది, గ్లూకోజ్‌ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలని దూరం చేస్తాయి. రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది. కండరాలను దృఢంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది. సీతాఫలంలో ఉండే కాపర్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. ఒక సీతాఫలంలోనే వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్‌ లభిస్తుంది. ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది. విటమిన్‌ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి.

సీతాఫలం తినడంవలన ఇన్ఫెక్షన్లు దరి చేరవు. గాయాలు కూడా త్వరగా మానుతాయి
సీజన్లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కండరాలు, నరాల బలహీనతను అధిగమించడానికి సీతాఫలం తోడ్పడుతుంది. చెడు కొలస్ట్రాల్ ను తొలగిస్తుంది. మలబద్దకం తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. కీళ్ల సమస్యకు ఈ పండు మంచి పరిష్కారం. పురుషులలో నరాల బలహీనత సమస్యను అరికడుతుంది. గర్భిణీలు కూడా తప్పక తినదగ్గ పండు సీతాఫలం. పిల్లలు పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించే గుణం ఈ పండుకి ఉంది. కండ పుష్టికి సులువైన మార్గం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. సీత ఫలం ఆకులను పసుపుతో కలిపి పేస్ట్ ల తయారుచేసి గాయాలకు లేపనం లాగా పూస్తే త్వరగా మానిపోతాయి. సీతాఫలం గింజలు పొడిచేసి ఆయిల్ లో కలిపి కుదుళ్లకు పట్టిస్తే పేళ్లు, చుండ్రు సమస్య తగ్గిపోతుంది. దంతాల వాపు, రక్తం కారడం లాంటి సమస్యలకు ఈ ఆకుల రసం పూస్తూ ఉంటె సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఈ పండు వలన ఇన్ని లాభాలున్నాయి కాబట్టే సీతాఫలాలకు డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి కాస్త రేటు ఎక్కువైనా ఈ సీజన్‌లో సీతాఫలాలు కొనుక్కు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here