Connect with us

Featured

Sushant Singh Rajputh: సుశాంత్ మరణించి రెండున్నరేళ్ళవుతున్నా ఇప్పటికీ ఖాళీగా ఉన్న ఫ్లాట్… ఇంట్లో దిగాలంటే భయపడుతున్న జనం !!

Published

on

Sushant Singh Rajputh: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి ఇంకా అభిమానులు బయటపడలేకపోతున్నారు.ఈయన తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే ఈయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోయినప్పటికీ ఈయన మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియా వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఇలా సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియా బయటకు రావడంతో కొన్ని నెలలుగా సుశాంత్ మరణం హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సుశాంత్ మరణించి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఈయన చనిపోయే ముందు నివాసం ఉన్నటువంటి ఇంటికి ఎవరు అద్దెకు రాలేదని తెలుస్తోంది.

సుశాంత్‌ 2020, జూన్‌ 14 బాద్రాలోని తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన మరణం తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు అద్దెకు రాలేదని తెలుస్తోంది. తాజాగా ఇంటి బ్రోకర్ ఆ ఇల్లు ఖాళీగా ఉందని ఎవరికైనా కావాల్సి ఉంటే క్రింది నెంబర్లకు సంప్రదించండి అంటూ ఫోన్ నెంబర్లు కూడా పోస్ట్ చేశారు. దీంతో ఆ ఇల్లు ఇప్పటికి ఖాళీగా ఉందని అర్థమవుతుంది.

Sushant Singh Rajputh: భయంతో అద్దెకు రాలేదు..

ఈ విధంగా ఈ ఇల్లు ఇప్పటి వరకు ఖాళీగా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈ ఇంట్లో సుశాంత్ ఆత్మ తిరుగుతుందని, ఒక పుకారు పుట్టించారు. దీంతో ఆ ఇంట్లో ఉండాలని ఆసక్తి చూపినప్పటికీ ఈ విషయం తెలిసి కొందరు ఇంట్లోకి రావడానికి భయపడుతున్నారు.అదేవిధంగా ఇంటి ఓనర్ నెలకు 5 లక్షల రూపాయలకు ఏమాత్రం తగ్గదని చెప్పడంతో అంత మొత్తంలో అద్దె చెల్లించుకోలేక ఇప్పటివరకు ఎవరు కూడా ఈ ఇంటిలోకి అద్దెకు దిగలేదని తెలుస్తోంది.

Advertisement

Advertisement

Featured

Manchu Manoj: మనోజ్ వెన్నెముకకు కడుపులో గాయాలు… తీవ్ర గాయాలు పాలైన మనోజ్!

Published

on

Manchu Manoj: సినీ నటుడు మంచు మనోజ్ పై తన తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే సినీ నటుడు మనోజ్ ఒంటిపై గాయాలు కూడా ఉండటంతో ఈ విషయం కాస్త మీడియా వార్తలలోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ సంచలనంగా మారింది.

Advertisement

నిన్న సాయంత్రం ఒంటినిండా గాయాలతో జూబ్లీహిల్స్ హాస్పిటల్ కి మనోజ్ వెళ్లారు. అయితే ఆయనకు కొన్ని పరీక్షలు నిర్వహించాలని ఆ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్స్ తాజాగా వెళ్లడయ్యాయి. రిపోర్ట్స్ ప్రకారం ఈయన వెన్నెముకకు తీవ్రమైన గాయం తగిలినట్టు తెలుస్తుంది. అలాగే కడుపులో కూడా గాయమైందని మెడపై గోర్లు ఘాట్లు పడినట్లు వెల్లడించారు.

ఆస్తి వివాదంలో భాగంగా మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య వివాదం చోటు చేసుకుందని అయితే ఈ వివాదంలో భాగంగా మంచు మనోజ్ పై తన తండ్రి దాడి చేయించారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలను మాత్రం మోహన్ బాబు పిఆర్ టీమ్ ఖండిస్తున్నారు.

Manchu Manoj: వెన్నెముక గాయం..

ఈ విధంగా మెడికల్ లీగల్ రిపోర్ట్స్ ప్రకారం మంచు మనోజ్ ఒంటిపై గాయాలు ఉన్నాయని ఆయన పై దాడి జరిగిన మాట వాస్తవమేనని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన మంచు మనోజ్ అభిమానులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా జాగ్రత్తగా ఉండాలని ఈయనకు సూచనలు చేస్తున్నారు. అయితే భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే మంచు కుటుంబం ఈయనని దూరం పెడుతూ వస్తున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Niharika: మలయాళ హీరోతో రొమాన్స్ లో మునిగి తేలుతున్న మెగా డాటర్… వీడియో వైరల్!

Published

on

Niharika: మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈమె నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Advertisement

ఇక నిహారిక తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మలయాళంలో ఈమె నటించిన మదరాస్కారన్ అనే సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో చెలి సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ అలలే చిట్టి అలలే పాటను రీమిక్స్ చేశారు.

ఈ పాటను మలయాళంలో మంచి మంచి రొమాంటిక్ నెంబర్ లా తెరకెక్కించారు. ఈ పాటలో నిహారిక హాట్ స్టెప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా నిహారిక పొట్టి పొట్టి దుస్తులలో భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ హాట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ పాటలో అదరగొట్టారని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Niharika: రొమాంటిక్..

ఇక పెళ్లి చేసుకొని భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు మరి హీరోయిన్ గా కూడా మంచి సక్సెస్ అవ్వాలన్న కోరికతో తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చిన నిహారికకు ఈ సినిమా అయినా మంచి సక్సెస్ అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

KCR: తెలంగాణ తల్లి మార్పు మూర్ఖత్వం… అసెంబ్లీ రాకపై క్లారిటీ ఇచ్చిన కెసీఆర్!

Published

on

KCR: తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని సరిగా ఏడాది కాలం అయ్యింది. ఈ క్రమంలోనే నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది రాజకీయ నాయకులకు ఆహ్వానాలు కూడా అందాయి. అయితే ఇలా తెలంగాణ తల్లిని మార్చడం పట్ల కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తన ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఈయన రేవంత్ రెడ్డి సర్కారు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణ తల్లిని మార్చడం మూర్ఖత్వం అని తెలిపారు. ఇక ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావనకు తీసుకురావాలంటూ ఈయన ఎమ్మెల్యేలకు సూచించారు

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తిని అందరికీ వివరించాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు గులాబీ బాస్ పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి కానీ.. ఇలా విగ్రహాలు, గుర్తుల మార్పుపై కాదంటూ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ పేర్కొన్నారు.

KCR: అసెంబ్లీకి వెళ్ళరా..

ఇక నేడు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈయన ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశాలు చేశారు ఇలా కెసిఆర్ ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని చూస్తే కనుక ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా ఈయన హాజరు కావడం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఫిబ్రవరిలో నిర్వహించబోయే బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా ఈయన బయటకు రాబోతున్నారని తెలుస్తుంది. ఇక ఏడాది నుంచి కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే కెసిఆర్ పరిమితమయ్యారు. ఇక రేవంత్ రెడ్డి ఏ వేదిక వెళ్ళిన అసెంబ్లీకి రావాలి అంటూ కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!