గోవా టూర్ లో ఈ ప్రదేశాలను మిస్ అవ్వకండి.. అవేంటంటే.. ?

0
104

ఎన్ని సార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపించే ప్రదేశం గోవా. ఎంతో అనుభూతిని ఇస్తుంది ఈ గోవా టూర్. దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ ఒక వైపు ఉంటే.. గోవా ఒక్కటే మరో వైపు ఉంటుంది. అంతలా కనుల విందు చేస్తుంది. మిగిలిన చోట్ల కళ్ళతో చూసి అనుభూతుల్ని మనసు నిండా నింపుకుంటాం. గోవాలో మనసును కొత్త అనుభవాలతో రిఫ్రెష్ చేసుకుంటాం. అయితే ఈ ప్రదేశానికి ఎలా వెళ్లాలంటే..

విజయవాడ నుంచి వాస్కోడగామాకు అమరావతి ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుంచి ప్రతి గురువారం వీక్లీ ఎక్స్ ప్రెస్, కాచిగూడ నుంచి వారంలో నాలుగు రోజులు మరో ఎక్స్ ప్రెస్ ఉన్నాయి.గోవాలో దిగిన తర్వాత అక్కడ నుంచి ట్యాక్సీ ద్వారా బీచ్ కి వెళ్లొచ్చు. ట్యాక్సీలో వెళ్తే వాళ్లు చూపించిన ప్రదేశాలు మాత్రమే చూడాలి.
వీటికంటే ఒక ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుంటే ఉత్తమం. ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించాలి. అద్దె రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది.

కారు కూడా అద్దెకు దొరుకుతుంది. అక్కడ ఉండటానికి బోలెడన్ని హోటళ్లు ఉంటాయి. రోజుకు కనీసం రూ.800 ఉంటుంది. 125 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్న గోవాలో అరంబోల్, వాగటర్, అంజున, బాగా, కాలాంగుట్, కండోలిం, సిన్క్విరిం, మిరమార్, డోనాపాలా బీచ్‌లు ఉత్తరం వైపున ఉంటాయి. కోల్వా, కావలోసియం, మోబార్, పాలోలెం బీచ్‌లు దక్షిణగోవాలో ఉంటాయి. బీచ్ లల్లో ముఖ్యంగా బాగా బీచ్, కాలాంగుట్, అంజున బీచ్, కోల్వా, పాలోలెం బీచ్ లకు తప్పనిసరిగా వెళ్తే ఎంతో అనుభూతిని పొందుతాం. ఉత్తర గోవాలో కాలాంగుట్ బీచ్, బాగా బీచ్ లు రద్దీగా ఉండి సందడిగా ఉంటాయి. ఇదే వరుసలో కొండల మధ్య ఉంటుంది అంజునా బీచ్. ఈ బీచ్ ప్రకృతి అందాలకు నెలవు.

ఇక్కడున్న వ్యూ పాయింట్ నుంచి మంచి దృశ్యాలను ఫోటోలు తీసుకోవచ్చు. ఈ బీచ్ లల్లో పారాసైలింగ్, వాస్కో సమీపంలోని గ్రాండ్‌ ఐలాండ్‌ లో స్కూబా డైవింగ్ లు చేసుకోవచ్చు. వాలో తప్పక చూడాల్సింది బామ్ జీసస్‌ బాసిలికా చర్చి కూడా. గోవాలో రాత్రి సందడి అంతా పర్యాటకులదే. అక్కడ నివసించే ప్రజలు మాత్రం సాయంత్రం ఆరు గంటలకల్లా కార్యాలయాల నుంచి ఇళ్ళకు చేరుకుంటారు. ఇలా మీ గోవా టూర్ ని ప్లాన్ చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here