Connect with us

Featured

Tollywood Director: ఏ హీరోయిన్ అయినా తనకు కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. ఆ ఒక్క కారణంతోనే డైరెక్టర్ కి విడాకులు ఇచ్చిన భార్య?

Published

on

Tollywood Director: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకనిర్మాతలు తమకు కమిట్మెంట్ ఇస్తేనే సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని చెబుతుంటారు..ఇలా ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగడం కోసం తప్పనిసరి పరిస్థితులలో కమిట్మెంట్ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు కూడా ఉన్నారు.

Advertisement

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్న ఓ డైరెక్టర్ ఎక్కువగా నిజ జీవితానికి దగ్గరగా ఉండే సినిమాలను చేస్తూ ఉంటారు.ఇలా ఇండస్ట్రీలో పలువురు హీరోలతో మంచి హిట్ సినిమాలను చేసినటువంటి ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోతో కూడా వైవిద్యమైన సినిమాని చేస్తున్నారు.ఈ సినిమా గత రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది అయితే ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి.

ఇకపోతే ఈయన మాత్రం తాను దర్శకత్వం వహించే సినిమాలలో హీరోయిన్లుగా నటించే అవకాశాలు అందుకోవాలని ముందుగా అతనికి కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా హీరోయిన్లతోఎంతో చనువుగా ఉంటూ వారిని పూర్తిగా వాడుకునే నైజం ఈ దర్శకుడికి ఉండటంవల్ల ఈయన తన వైవాహిక జీవితం కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే కొనసాగిందని చెప్పాలి.

Tollywood Director: అమ్మాయిల పిచ్చే భార్యను దూరం చేసిందా…

ఈ డైరెక్టర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఏడాది తిరిగేలోపు తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే ఇలా తన భార్య తనకు విడాకులు ఇవ్వడానికి గల కారణం ఇతను హీరోయిన్లతో చనువుగా ఉండటమేనని తెలుస్తోంది.ఈయనకు పెళ్లి జరిగినప్పటికీ పలు కారణాలవల్ల భార్యను దూరం పెడుతూ హీరోయిన్లతో గడిపే వారట అయితే ఓసారి నేరుగా తన భర్తని హీరోయిన్ తో చూడటం వల్ల ఈమె విడాకులు ఇచ్చినట్టు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Advertisement

Featured

Allu Arjun: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు… అల్లు అర్జున్ పోస్ట్ వైరల్!

Published

on

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా బుకింగ్స్ మొదలైన విషయం తెలిసిందే.

Advertisement

ఒక ఏపీలో మినహా అన్ని ప్రాంతాలలో కూడా బుకింగ్స్ మొదలయ్యాయి అయితే ఏపీలో టికెట్ల రేట్లు పెంచే విషయం గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు కానీ ఇటీవల ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుతూ జీవో విడుదల చేస్తున్న దీంతో ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

ఇలా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలకు కూడా అనుమతి లభించడంతో నటుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి తెలిపిన ఏపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Allu Arjun: ధన్యవాదాలు..

ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీ మేలుకోసం ఈ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే చిత్ర పరిశ్రమను బలోపేతం చేయటంలో ఆయన అమూల్యమైన మద్దతు తెలిపిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

https://x.com/alluarjun/status/1863618011095289933?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1863618011095289933%7Ctwgr%5E5bd6ad21a390ad7c2d6e9315e24abe81aabb9dea%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fm.dailyhunt.in%2Fnews%2Findia%2Ftelugu%2Fdishadaily-epaper-dhc1d53bdd29b641be87e997a6e1ff289d%2Fdipyutisiempavankalyaankuhrudayapurvakadhanyavaadaaluhiroalluarjun-newsid-n641751837

Advertisement

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ పై ప్రశంసలు కురిపించిన పేర్ని నాని… సాహసం చేశారంటూ?

Published

on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ వైకాపా మంత్రి పేరుని నాని ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి షిప్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే

Advertisement

ఈ విషయం గురించి పేర్ని నాని మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ కాకపోయినప్పటికీ తన ప్రాణాలకు తెగించి మరీ సముద్రంలోకి వెళ్లినందుకు తనని ప్రశంసిస్తున్నానని తెలిపారు..అనుభవమున్న రంగం కాబట్టి షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో భాగంగా రెండు నెలల నుంచి నాకు ఇక్కడకు రావడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు కష్టమ్స్ ఆఫీసర్, పోర్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా బోర్డు లోనే ఉన్నారు మరి ఆయనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒకటి చంద్రబాబు నాయుడు అయినా తనకు అనుమతి తెలపక పోవాలి లేదంటే పవన్ కళ్యాణ్ అయిన అబద్ధం చెప్పి ఉండాలని పేరుని నాని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేశారు సీజ్ ద షిప్ అని కెన్ స్టార్ షిప్ ను ఎందుకు అనలేదని, ఆ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు. ఆ షిప్ లో అక్రమంగా బియ్యం రవాణా జరిగి ఉండదా అంటూ ఈయన సరికొత్త సందేహాలను వ్యక్తపరిచారు.స్టెల్లా షిప్ ను 36 మంది ఎక్స్ పోర్టర్లు 35 వేల టన్నులు ఎక్స్ పోర్టు కోసం తెచ్చుకున్నారు. కెన్ స్టార్ షిప్ లో ఒకే ఎక్స్ పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం ఎక్స్ పోర్టు చేస్తున్నారు.

Advertisement

Pawan Kalyan: పయ్యావుల కేశవ్..

మరి పవన్ కళ్యాణ్ ఎందుకని కెన్ స్టార్ షిప్ దగ్గరకు వెళ్లలేదు అంటూ ఈయన ప్రశ్నించారు ఎందుకంటే ఆ షిప్ స్వయానా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు వేల్పూరి శ్రీనుకి సంబంధించినది కావటం విశేషం. అందుకనే పవన్ కళ్యాణ్ ఈ షిప్ వద్దకు వెళ్లలేదు అంటూ సరికొత్త సందేహాలను బయటపెట్టారు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: మొదటి సినిమా పట్టాలే ఎక్కలేదు.. రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోక్షజ్ఞ?

Published

on

Mokshagna: నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈయన చాలా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సరైన కథ డైరెక్టర్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. హనుమన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకోలేదు అలాగే సినిమా ఇంకా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాలేదు కానీ ఈయన రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పూజ కార్యక్రమాలు డిసెంబర్ ఐదో తేదీ ఎంతో ఘనంగా జరగబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం లేదు.

ఇలా డిసెంబర్ ఐదవ తేదీ పూజా కార్యక్రమాలను జరుపుకొని వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత మరో డైరెక్టర్ ను మోక్షజ్ఞ లైన్లో పెట్టారని తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో అనే విషయానికొస్తే ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో మోక్షజ్ఞ తన రెండో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

Mokshagna: వెంకీ అట్లూరి…

సార్ , లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి నందమూరి హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సిందే.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!