టాలీవుడ్ డైరెక్టర్ తేజ నన్ను మోసం చేశారంటూ సంచలన కామెంట్స్ చేసిన ఒకప్పటి హీరోయిన్ రాశి..

0
501

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి దశాబ్దం క్రితం వరకూ సెంటిమెంట్, లవ్ పాత్రలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, గోకులంలో సీత, స్నేహితులు, దేవుళ్ళు వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రాశికి హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన సమయంలో.. ‘నిజం’ ‘కళ్యాణ వైభోగం’ ‘లంక’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ అవి కూడా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇదిలా ఉండగా..

ఈమధ్య మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో రాశి ఓ బాంబు పేల్చింది. తనను ‘నిజం’ సినిమా విషయంలో డైరెక్టర్ తేజ మోసం చేశాడని, టాలీవుడ్ లో తనకున్న పేరు పోగొట్టుకోకూడదనే.. ఆ చిత్రంలో ఆ బోల్డ్ క్యారెక్టర్ లో నటించాల్సివచ్చిందని చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంతకీ రాశి ఏం చెప్పిందంటే.. “సాధారణంగా నేను ఏ సినిమా ఆఫీస్‌లకు వెళ్లను. ఒకరోజు సడెన్ గా అప్పటికే మంచి ఫామ్ లో వున్న డైరెక్టర్ తేజ  పిలిచారని ఆయన ఆఫీస్‌ కు వెళ్లాను. ‘నిజం’ చిత్రకథ చెప్పి మహేశ్‌ బాబు హీరో అన్నారు. ‘గోపీ చంద్‌.. నువ్వు లవర్స్‌. మధ్యలో విలన్‌ వస్తాడు. మొత్తం మీదే ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ’ అని చెప్పడంతో నేనూ ఒప్పుకొన్నాను. తీరా షూటింగ్‌ కు వెళ్లిన తర్వాత ఫస్ట్‌ సీన్‌ తీయగానే నాకర్థమైపోయింది. ఆ తర్వాత ‘నిజం’ సినిమా నుంచి తప్పుకొందామని నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని మా PRO బాబూరావు గారికి చెప్పాను. ‘మేడమ్‌.! మీరు ఇప్పటివరకూ ఏ సినిమా 
విషయంలో ఇలా చేయలేదు. సడెన్‌గా ఇలా చేస్తే, టాలీవుడ్ లో మీకు చెడ్డపేరొస్తుంది. ఎలాగో ఒప్పుకొన్నారు కాబట్టి ఈసారికి ఇలా కానిచ్చేయండి’ అన్నారు. మా అన్నయ్య కూడా ‘పోనీలే చేసేయ్’ అన్నాడు. దీంతో ఒప్పుకోక తప్పలేదు.

కానీ, ఆ తర్వాత ఆ పాత్రకు రకరకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ‘నిజం’ చిత్రంలో నా పాత్ర చాలా నెగిటివ్ గా ఉంటుంది. ఆ చిత్రంలో గోపిచంద్ విలన్.. ఆ విలన్ కు లవర్ గా లేడీ విలన్ పాత్రలో నేను.. నటించాల్సి వచ్చింది. నెగిటివ్ మరియు వల్గర్ షేడ్స్ ఉన్న ఇలాంటి సినిమాను రాశి ఎందుకు చేసిందా.? అంటూ అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. కాకపోతే.. నటి అన్నాక అన్నీ పాత్రలలో నటించాలి కదా అనుకున్నారు టాలీవుడ్ ప్రముఖులు” అంటూ తన మనో భావాలను తెలియజేసింది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి.