సరికొత్త ఆలోచన.. నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్న మహిళ.. ఎలాగంటే?

0
792

గత రెండు సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంతో చాలామందికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టువంటి ఒక సాధారణ గృహిణి చేసిన ఆలోచన ఇప్పుడు ఆమెను ఉన్నతమైన వ్యాపారిగా నిలబెట్టింది.కేవలం రెండు లక్షలతో పెట్టుబడి పెట్టిన ఆ మహిళ ప్రస్తుతం నెలకు 2 లక్షలు లాభాన్ని పొందుతుంది. ఇంతకీ ఆ మహిళ చేసిన వ్యాపారం ఏమిటి? ఆమె విజయం వెనుక దాగిఉన్న ఆలోచన ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

హీనా యోగేష్ భేడా అనే మహిళకు 15 ఏళ్ల కిందట పెళ్లి అయింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే వీరి పెద్ద బాబుకు 7 వారాలు తొందరగా జన్మనివ్వడంతో అతడు పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పెరిగేకొద్ది రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే హీన తన కొడుకులో ఏ విధంగా ఇమ్యూనిటీని పెంచాలనే ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే తన ఆలోచనలన్నీ మన బామ్మలు చెప్పిన వనమూలికల వైపు మళ్ళాయి.

ఈ క్రమంలోనే హీన వన మూలికల గురించి అధ్యయనం చేపట్టింది. తన కొడుకులా మరెవరూ బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే హీనా అడుగు ముందుకు వేసింది.
గిలాయ్, అశ్వగంధ,మోరింగ పై ప్రయోగాలు చేసింది. ఈ విధంగా వనమూలికలలో దాగి ఉన్న శక్తిని మన శరీరం లోకి ప్రవేశించాలంటే టీ పొడి ద్వారా మాత్రమే వీలవుతుందని భావించిన ఈమె టీ పొడిలో కెఫిన్ లేకుండా తయారుచేసింది.

ఇలా వివిధ రకాల ఉత్పత్తులను చేసి రెండు లక్షల పెట్టుబడితో యువ సౌల్ అనే వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే హీనా తయారుచేసే ఈ ఉత్పత్తులకు ఆదరణ పెరగడంతో ప్రస్తుతం హీన మరికొంత మందికి ఉపాధిని కల్పిస్తూ తన వ్యాపారాన్ని విస్తరించింది. మొదటి నెలలో కేవలం 20 వేలు లాభం రాగా ఇలా నెలనెలా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం నెలకు 2.5 లక్షల లాభాన్ని పొందుతోంది.త్వరలోనే ఆన్లైన్ ద్వారా తన ఉత్పత్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here