ఆ ఘటన తన జీవితాన్నే మార్చింది.. ఓ మహిళ అ విజయ గాధ..!

0
127

ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు ఉన్నారు. అయితే వీరిలో కొందరు వారసత్వంగా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఇంతటి స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.ఈ విధంగా కేవలం తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు తన వ్యాపారాన్ని ఇతర దేశాలలో వ్యాపింపజేసే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు
కృతిక కుమరన్.

ఈమె పుట్టి పెరిగింది తమిళనాడులోని గోబిచెట్టిపాలయం అనే పట్టణంలో.తమిళనాడు తప్ప మరో రాష్ట్రం తెలియని కృతికకు 21 సంవత్సరాలకు పెళ్లి చేసే అత్తారింటికి పంపించారు. ఈ క్రమంలోనే కృతిక తల్లి మంజులాదేవి తీవ్రమైన చర్మ సమస్యలతో బాధ పడేది.ఈ క్రమంలోనే వైద్యులు ఆమెకు స్టెరాయిడ్లు ఇచ్చేవారు. అధికంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడై ఆమె మరణించారు. ఈ విధంగా తల్లి మరణం కృత్తికను ఎంతో కృంగదీసింది.తన తల్లి లాగా మరొకరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో చేసిన ఆలోచన నుంచి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది.

ఆ ఐడియానే ఆర్గానిక్ సబ్బులు తయారు చేయడానికి అడుగులు వేసింది. తన తల్లి మరణానికి కారణం సభ్యులే అని తెలుసుకున్న కృతిక సహజసిద్ధంగా సభ్యులను తయారుచేయాలని భావించింది. ఈ క్రమంలోనే సహజసిద్ధంగా లభించే నూనెలు, మేక పాల సహాయంతో సభ్యులను తయారుచేసింది.తాను తయారు చేసిన సభ్యులను తమ కుటుంబ సభ్యులకు సన్నిహితులకు ఉచితంగా ఇచ్చింది. అయితే అది మంచి ఫలితాలను చూపించటంతో ఆమె వ్యాపారానికి కొత్త దారిని పరిచయం చేసింది.

నేచురల్ కాస్మెటోలజీ కోర్స్‌లో చేరి వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకొని తన ఇంటిని ఒక ప్రయోగశాలగా మార్చి ఉత్పత్తులను తయారుచేసింది. ఈ విధంగా తాను తయారు చేసిన ఉత్పత్తులను 2017 వ సంవత్సరంలో విల్వా స్టోర్ ప్రారంభించి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు.ఈ విధంగా ఈమె తయారు చేసిన సబ్బులలో ఎలాంటి రసాయనాలు లేకుండా సహజసిద్ధంగా లభించే నూనె మేక పాలతో తయారు చేయడంతో వీటికి ప్రాధాన్యత పెరిగింది.

ప్రస్తుతం కృతిక సబ్బులలో మాత్రమే కాకుండా.. షాంపూలు, క్లీనర్స్, టోనర్,మాస్కులు, మాయిశ్చరైజర్లు, జెల్స్, లిప్ బామ్స్, కంటి ఉత్పత్తులను తయారు చేసే వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అదే విధంగా ఈ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా సొంత వెబ్ సైట్ తో పాటు, అమెజాన్,నైకాలో కూడా అందుబాటులోకి తెచ్చారు. కేవలం పది వేల రూపాయల పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారం ఇతర దేశాలకు పాకింది.ప్రస్తుతం తాను ఇంతటి విజయాన్ని సాధించింది అంటే తన విజయం వెనుక తన తల్లి దీవెనలు ఉన్నాయని కృతిక తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here