కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉపాధి లేక సొంతూళ్లకు వచ్చి ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. చాలామందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల వ్యాపారం చేయాలంటే టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక బిజినెస్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సులభంగా సంపాదించవచ్చు.

రోజురోజుకు మార్కెట్ లో పుట్టగొడుగులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మార్కెట్ లో కూడా పుట్టగొడుగులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇంటి దగ్గరే సులువుగా పుట్టగొడుగులను పెంచి ఆదాయం పొందవచ్చు. మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉండే పుట్టగొడుగులు కిలో 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ధర పలుకుతాయి.

మనకు శరీరానికి అవసరమైన విటమిన్లు అన్నీ పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి. కంపోస్ట్ సహాయంతో ఇంటి దగ్గరే సులభంగా పుట్టగొడుగులను పెంచడం సాధ్యమవుతుంది. క్వింటాల్ కంపోస్ట్ సహాయంతో సులువుగా కేజిన్నర పుట్టగొడుగులను పెంచవచ్చు. కేజీ 120 నుంచి 170 మధ్య అమ్మినా పెట్టుబడి పోతే రెండు లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలు మిగులుతుంది.

ట్రేలలో సాగు చేసే పుట్టగొడుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ వ్యాపారం చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో కళ్లు చెదిరే లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here