Connect with us

Featured

YS Jagan: ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా… ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి?

Published

on

YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో అత్యంత మెజారిటీతో గెలిచారు కానీ ఈ ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే స్పీకర్ కి లేఖ రాస్తూ తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే సమస్యల పట్ల ప్రశ్నించే హక్కు ఉంటుందని ఈయన లేఖ రాసినప్పటికీ స్పీకర్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాలేదు.

Advertisement

ఈ క్రమంలోనే ఈయన అసెంబ్లీలోకి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడపలో ఉప ఎన్నికలను నిర్వహిస్తూ కడప ఎంపీగా అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన ఎంపీగా ఎన్నికలలో పోటీ చేస్తూ పార్లమెంటుకు వెళ్తున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.

ఇక ఇటీవల వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కడపలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయని తెలుస్తోంది. అలా జరిగితే షర్మిల తరపున నేను ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు. దీంతో ఈ వార్తలు మరింత చక్కర్లు కొట్టడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ చిన్నాన వై వి సుబ్బారెడ్డి స్పందించారు.

దుష్ప్రచారాలే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తూ పార్లమెంటుకు వెళ్తారని వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆవాస్తవమని ఇవన్నీ కేవలం టిడిపి వారి దుష్ప్రచారాలే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా జగన్ గురించి వస్తున్న ఈ వార్తలలో నిజం లేదని ఈయన వెల్లడించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Star Actress: స్టార్ హీరో పై చేయి చేసుకున్న హీరోయిన్…ఒక్క హిట్ లేకపోయినా క్రేజ్ తగ్గలేదుగా?

Published

on

Star Actress: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. వారు నటించిన సినిమాలు ఒకటి రెండు సక్సెస్ కాకపోతే వారికి అవకాశాలు రావడం గగనం. అలాంటిది ఒక హీరోయిన్ వరుసగా 15 సినిమాలలో నటించిన అవి ఏవి సక్సెస్ కాకపోయినప్పటికీ ఆమెకు మాత్రం ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గలేదు. మరి ఈ రేంజ్ లో ఫ్లాప్స్ ఉన్న క్రేజ్ తగ్గని ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే..

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన నటి సోహా అలీఖాన్.ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్, మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి దంపతుల కూతరు ఈమె. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు సిస్టర్. ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి హీరోయిన్గా ఈమె అడుగు పెట్టినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

అయితే ఈమె ఇటీవల నటించిన వరుస 15 సినిమాలు ఫ్లాప్ కావడంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సహాయ పాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈమె ఇటీవల ఒక హీరో పై చేయి చేసుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సన్నీ డియోల్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అయితే ఈయన ఘాయల్ వన్స్ ఎగైన్ సినిమాలో నటించారు.

సన్నీ డియోల్….

Advertisement

ఈ సినిమా 2015 వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో అనుకోని సంఘటన జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సన్నీ డియోల్ పై చేయి చేసుకోవడంతో ఈ విషయం కాస్త బాలీవుడ్ లో చర్చలకు కారణమైంది. అయితే సోహా అలీ ఖాన్ ఉద్దేశపూర్వకంగా తనపై చేయి చేసుకోలేదని భావించిన సన్నీ డియోల్ ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు.

Advertisement
Continue Reading

Featured

Actor Harish: హీరో హరీష్ ప్రాణాలను కాపాడిన నటి కరిష్మా కపూర్… అసలు ఏం జరిగిందంటే?

Published

on

Actor Harish: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు హరీష్ . ఇక ఈయన హీరోగా నటించి సక్సెస్ అందుకున్న సినిమాలలో ప్రేమఖైదీ ఒకటి. ఈ సినిమాలో హరీష్ మాలా శ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేశారు.

Advertisement

ఇక హిందీలో కూడా హరీష్ హీరోగా నటించిన హీరోయిన్గా కరిష్మా కపూర్ నటించారు. ఈ సినిమా ద్వారా ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కరిష్మా కపూర్ ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం తిరిగి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కరిష్మా కపూర్ ఆప్కా అప్నా జకీర్ షోలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మొదటి సినిమా ప్రేమఖైదీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా సమయంలో హీరో హరీష్ ప్రాణాలను తాను కాపాడానని ఈమె తెలిపారు. నిజానికి ఈ సినిమాలో నేను నీటిలో పడి మునిగిపోతూ ఉండగా హీరో వచ్చి నన్ను కాపాడాలి ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈత రాదు..
నిజానికి ఈ సన్నివేశాన్ని స్విమ్మింగ్ పూల్ లో చేయాలి అది కూడా నాలుగు అడుగుల లోతు నీటిలో. కానీ మేము ఈ సన్నివేశంలో మునిగిపోయి ఐదు అడుగుల లోతు వరకు వెళ్ళాము. నిజానికి హరీష్ కి ఈతరాదనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ సన్నివేశంలో మునిగిపోయి నేను రక్షించండి అంటూ అరవడంతో వెనకనుంచి నన్ను రక్షించండి అంటూ హరీష్ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆయన మునిగిపోతూ ఉన్నారు. అప్పుడు నేను తనని చేయి పట్టుకొని బయటకు లాక్కొచ్చి తనని కాపాడాను.. అలా మొదటి సినిమాలో హీరో నన్ను కాపాడాల్సింది పోయి నేనే హీరోని కాపాడాను అంటూ అప్పటి సంగతులను కరిష్మా కపూర్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ram charan: తల్లంటే భయమా.. భార్య అంటే భయమా.. చరణ్ సమాధానం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published

on

Ramcharan: సినీ నటుడు రామ్ చరణ్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. రామ్ చరణ్ సినిమాల విషం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఎంతో సౌమ్యుడు అనే సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఎలాంటి వివాదాలలోకి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. ఇక ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో అయినప్పటికీ తన తండ్రికి ఎంతో గౌరవం ఇస్తారనే సంగతి మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ కి సంబంధించిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

రామ్ చరణ్ ఎక్కువగా తన తల్లికి భయపడతారా లేకపోతే తన భార్య ఉపాసనకు ఎక్కువగా భయపడతారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు రామ్ చరణ్ చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ నేను ఇంట్లో ఎన్నో సందర్భాలలో మా నాన్న అమ్మతో చాలా జాగ్రత్తగా మాట్లాడటం గమనించాను.
ఉపాసన అంటే భయమా..
మా ఇంట్లో అందరికీ మా అమ్మ బాస్. మా నాన్న మాత్రమే కాదు నేను అలాగే మా బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మతో చాలా జాగ్రత్తగా ఉంటారని తెలిపారు. ఈ విషయంలో నేను కూడా నాన్నను ఫాలో అవుతూ ఉపాసన దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు. దీంతో ఈయన ఉపాసనకి ఎక్కువగా భయపడతానని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారు అంటూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!