Connect with us

Featured

మన టాలీవుడ్ తారలు – బంధుత్వాలు !!

Published

on

టాలీవుడ్ లో ఎంతోమంది గొప్ప నటీనటులు, దర్శకులు, మరెందరో కళాకారులున్నారు. కేవలం సినిమాపై వున్న మమకారంతో వారందరూ ఎన్నో అష్టకష్టాలు పడి తెలుగు చిత్రసీమకు పరిచయమౌతున్నారు. అయితే టాలీవుడ్ లోనే ఒకే కుటుంబం నుండి కొందరు నటీనటులు, కళాకారులు పరిచయమయ్యారు.

కానీ వాళ్ళమధ్య వున్న బంధుత్వాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి. అందుకే టాలీవుడ్ లో వుంటూ మంచి గుర్తింపు ను సంపాదించుకున్న కొందరి సినీ ప్రముఖుల బంధుత్వాల గురించి ఇప్పుడు చదివి తెలుసుకోండి.

టాలీవుడ్ లో చోటా కె నాయుడు గారి కెమెరా పనితనం గురించి చెప్పనక్కర్లేదు , ఆయన హీరోలని చాలా బాగా చూపిస్తారనే మంచి పేరుంది. చోటా కె నాయుడికి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు. సందీప్ హీరో గా నటించి చాలా సినిమాలకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేశారు.

అలనాటి మహానటి సావిత్రి, ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ రేఖ ఇద్దరూ తల్లీ కూతుళ్లు అవుతారు. సావిత్రిని రెండో పెళ్లి చేసుకున్న జెమిని గణేశన్ మొదటి భార్య పుష్పవల్లి కూతురే రేఖ.

గోపిచంద్, శ్రీకాంత్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచున్న శ్రీకాంత్ కి హీరో గోపిచంద్ బంధువేనన్న సంగతి చాలామందికి తెలియదు. గోపిచంద్ శ్రీకాంత్ గారి మేనకోడలిని పెళ్ళి చేసుకున్నాడు.

విశ్వ నటుడు కమల్ హాసన్, సహజ నటి సుహాసిని ల బంధుత్వం కోసం చెప్పాలంటే.. సుహాసినికి కమల్ స్వయానా బాబాయ్ అవుతారు. కమల్ అన్నయ్య చారు హాసన్ కూడా నటుడే. చారుహాసన్ కూతురే సుహాసిని. లెజెండ్ డైరెక్టర్ మణిరత్నంని 1988లో ఈమె పెళ్ళి చేసుకున్నారు.

కళాతపస్వి కె విశ్వనాధ్, నటుడు చంద్రమోహన్ కజిన్స్ అవుతారు. అందుకే తన సినిమాల్లో చంద్రమోహన్ ని విశ్వనాధ్ ఎక్కువగా ప్రోత్సాహించేవారు.

అలనాటి మేటి నటి, టాలీవుడ్ డైరెక్టర్ విజయ నిర్మల, సహజనటి జయసుధకు వరుసకు అత్తవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “పండంటి కాపురం” చిత్రం ద్వారా జయసుధ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అందాల తార శ్రీదేవి ఒక్క టాలీవుడ్ లోనే కాదు భారత దేశ సినీ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే గొప్ప నటి. అలాగే గులాబీ, పెళ్లిలాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేశ్వరి, శ్రీదేవి దగ్గరి బంధువులు. శ్రీదేవికి మహేశ్వరి మేనకోడలి వరుస అవుతుంది.

మతం మార్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్, జివి ప్రకాష్ ల మధ్య బంధం ఏమిటంటే.. సంగీత దర్శకునిగా పరిచయమై, హీరోగా మారిన ప్రకాష్, స్వయంగా రెహ్మాన్ సొంత అక్క కొడుకే.

టాలీవుడ్ లో పెద్ద కుటుంబాలుగా చెప్పుకునే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలో వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ గారు, నాగార్జున గారు మాజీ దంపతులు. వీరి కుమారుడే నాగ చైతన్య. వెంకటేష్ నాగార్జునలు సొంత బావ మరుదులు. కొన్ని కారణాల వల్ల నాగార్జున మొదటి భార్యతో విడాకులు తీసుకున్నప్పటికీ వీరి మధ్య మంచి స్నేహమే ఉంది.

‘సాహో’ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో నటించిన అరుణ్ విజయ్ ఎవరంటే, ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మొదటి భార్య కొడుకు. ఇక మొదటి భార్య చనిపోయాక మంజులను పెళ్లాడారు. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్లు ప్రీతి, ,శ్రీదేవి వీరి సంతానమే.

వందకు పైగా సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకులు కీరవాణి గారు, అలాగే తెలుగు దర్శకుల సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు S.S రాజమౌళి గారూ వీరిద్దరూ అన్నదమ్ముళ్లే. కీరవాణి గారి పిన్ని కొడుకు రాజమౌళి. రాజమౌళి గారూ తీసిన అన్ని సినిమాలకు సంగీతం అందించారు కీరవాణిగారు.

బాలీవుడ్ లో తన అసమాన ప్రతిభను చాటిన నటి విద్యాబాలన్, తెలుగులో పలు భాషల్లో నటించిన ప్రియమణి ఇద్దరూ కజిన్స్ అవుతారు. అలాగే ప్రముఖ గాయని మాల్గుడి శుభకు ప్రియమణి మేనకోడలు అవుతుంది.

హీరో రామ్, శర్వానంద్ ఇద్దరు తెలుగు సినిమాలో రాణిస్తున్న యువ హీరోలే. అయితే వీరిద్దరు దగ్గరి బంధువులు అన్న సంగతి మీకు తెలుసా.? అవును రామ్ పోతినేనికి శర్వానంద్ బావ వరుస అవుతాడు. శర్వానంద్ అన్న రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్య భర్తలు.

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ షబానా అజ్మీ ,టబు బంధం గురించి చెప్పాలంటే, షబానా అన్న కూతురే టబు.

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శ్రీహరి గారు కలిసి చాలా సినిమాలలో కలసి నటించారు. టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేశారు. కానీ వాస్తవానికి వీరిద్దరూ బంధువులేనన్న సంగతి అందరికీ తెలియదు. ప్రకాష్ రాజ్ గారి మొదటి భార్య, శ్రీ హరి గారి భార్య సొంత అక్క చెల్లెళ్లు.

1990లలో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించిన నగ్మాకు టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్స్ జ్యోతిక, రోహిణి చెల్లెల్లు అవుతారు. నగ్మా తల్లి పోయాక తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో జ్యోతిక, రోహిణి జన్మించారు. జ్యోతిక హీరో సూర్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

ఐశ్వర్య రాజేష్, శ్రీలక్ష్మి బంధం ఎలాంటిదంటే.. శ్రీలక్ష్మి సోదరుని కూతురు. ఒకప్పుడు హీరోగా చేసి, సడన్ గా మరణించిన రాజేష్ కూతురైన ఐశ్వర్య స్వయానా శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది.

ఎన్నో విజయవంతమైన మూవీ నిర్మించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్బీ చౌదరి కొడుకే నటుడు జీవా. జీవా నటించిన ‘రంగం’ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. చౌదరి మరో కుమారుడు జిషన్ కూడా కొన్ని సినిమాలు చేసాడు.

దర్శకుడు సెల్వ రాఘవన్ కి నటి విద్యుల్లేఖ రామన్ కి బావ అవుతాడు. మొదటి భార్యకు విడాకుల తర్వాత విద్యుల్లేఖ సోదరిని సెల్వ పెళ్లి చేసుకున్నారు.

మంచి మంచి సామాజిక అంశాలతో కథలల్లీ వాటికి మాస్ ఏలిమెంట్స్ ను జోడించి సినిమాలు తీస్తూ హీరోలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్నీ, ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా హిట్ల మీద హిట్లు కొడుతున్న కొరటాల శివ తెలుగు సినిమాలో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. అలాగే దర్శకుడిగా, నటుడిగా తనదైన శైలిలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పోసాని కృష్ణ మురళీ గారికి కొరటాల శివ మేనల్లుడు అవుతాడు. కొరటాల సినిమా రచయితగా మారడానికి ప్రోత్సాహం ఇచ్చింది కూడా పోసానియే.!

Advertisement
Continue Reading
Advertisement

Featured

AP Politics: కూటమికి మద్దతుగా మెగాస్టార్ .. జగన్ కి ఇది ఊహించని షాక్!

Published

on

AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.

ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.

Advertisement

మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే..
ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ సభలో కత్తులు కలకలం.. పోలీసుల అదుపులోకి ఇద్దరు యువకులు?

Published

on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.

ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.

Advertisement

దాడికి ప్రయత్నమా..
ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.

Advertisement
Continue Reading

Featured

AP Politics: గులకరాయికే విలవిలలాడితే గొడ్డలి పోటు సంగతి ఏంటి జగనన్న: షర్మిల

Published

on

AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.

ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.

Advertisement

కంచుకోటకు బీటలు..
ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!