కస్టమర్‌ కేర్‌కు ప్రాంక్ కాల్‌ చేసిన కేసీఆర్‌.. ఆమె ఎలా మాట్లాడిందో చూడండి (వీడియో)

0
1436

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడే ప్రతి మాట కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది కొన్ని సార్లు చేసే పనులు చిత్ర విచిత్రంగా అనిపిస్తాయి ఆయన అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సీఎం కేసీఆర్‌ ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటారు అని అంతా అంటూ ఉంటారు.తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచార పశువైధ్యశాలను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ జిల్లాల్లో ఈ పశువైధ్య శాల అనేది అన్ని చోట్ల ఉంటాయి. రైతులు ఫోన్‌ చేసి, పశువుకు అనారోగ్యం అంటూ చెప్పిన 30 నిమిషాల్లో ఈ సంచార పశువైధ్యశాల అనేది ఆ రైతు వద్దకు వస్తుంది. ఈ కొత్త వైధ్యశాలను మంత్రులతో కలిసి సీఎం చంద్రశేఖరావు ప్రారంభించారు.1962 నెంబర్‌ను ప్రారంభించి మొదటి కాల్‌ను చేయడం జరిగింది. 1962 నెంబర్‌కు డయల్‌ చేసిన కేసీఆర్‌ కాల్‌ను ఒక లేడీ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి పికప్‌ చేసుకున్నారు. మీ పశువుకు ఏమైంది అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించింది. అప్పుడు కేసీఆర్‌ ఇక్కడ పశువులు ఏమీ లేవమ్మ, ఇది కేవలం ప్రారంభ కాల్‌ అన్నారు. దాంతో అక్కడున్న వారు అంతా కూడా నవ్వేశారు.1962కు కాల్‌ చేసినందుకు దన్యవాదాలు అంటూ ఆమె కాల్‌ను కట్‌ చేసింది. మొత్తానికి కేసీఆర్‌ చేసిన మొదటి కాల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయన మాట్లాడిన తీరు అయన హస్య చతురత చూసిన వాళ్ళంత పడి పడి నవ్వుకుంటున్నారు..