గర్భం పొందాలంటే అండం కావాలి మరి అండం విడుదల అయిందని ఎలా తెలుస్తుంది..!!

0
6300

స్త్రీలు గర్భం దాల్చాలంటే వారిలో అండం విడుదల కావాలి అయితే స్త్రీలలో అండం నెలకు ఒక్కసారి మాత్రమే విడుదల అవుతుంది.అయితే అండం విడుదల సమయంలో స్త్రీలలో అలాంటి మార్పులు వస్తాయి ఏ రోజు స్త్రీలో అండం విడుదల అవుతుంది అనేదాని గురించి తెలుసుకుందాం. ఏ స్త్రీ అయినా బహిష్టు మొదటి రోజు నుంచి తిరిగి మరల బహిష్టు అయ్యేవరకు రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే ధర్మ మీటర్ తో టెంపరేచర్ ను చెక్ చేసుకొని రోజువారీగా ఒక పేపర్ లో రాసుకోవాలి అలా కొద్దిరోజుల వరకు టెంపరేచర్ 96.6 F నుండి 97.4 F ఉంటుంది.

ఆ తరువాత అకస్మాత్తుగా ఒక రోజు 99 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరిగి కొద్ది రోజులు ఇలానే ఉంటుంది.ఇలా ఒక 10 నుండి 12 రోజుల వరకు ఉంటుంది తరువాత మల్లె తగ్గిపోయి రెండు మూడు రోజుల్లో బహిష్టు వస్తుంది.ఇలా అకస్మాత్తుగా టెంపరేచర్ పెరిగిన రోజున అండం విడుదల అవుతుంది.దీనివలన కడుపునొప్పితో బాధపడుతుంటారు కొందరు స్త్రీలు అంటే ఈ సమయంలో ప్రేజేస్తిరాన్ అనే హార్మోన్ ఎక్కువవుతుంది.దీంతో బాడీలో టెంపరేచర్ కూడా పెరిగి అండం విడుదల అవుతుంది.ఇవన్నీ స్త్రీలో అండం విడుదల అవుతుంది అని తెలియజేయడానికి గుర్తులు.అయితే గర్భం వచ్చిన వారిలో శరీర ఉష్ణగ్రత తగ్గకుండా అలానే ఉంటుంది.