Connect with us

Featured

టాప్ హీరో చేయూత ఇచ్చిన దారుణమైన స్థితిలో మరణించిన బాలక్రిష్ణ మొదటి సినిమా హీరోయిన్

Published

on

బాలకృష్ణ మొదటి హీరోయిన్ ఆత్మహత్యచేసుకుందని మీకు తెలుసా….?
విజ్జి…. ఎయిటీస్ లో ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక చక్కటి నటి. అందం, అభినయం రెండూ కలగలిసిన ఆమె 1982 లో గంగై అమరన్ చిత్రం కోళి కూవుదు సినిమాతో తమిళ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో , ఆమెకు తమిళ్ లో ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ఆమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఆమె తనకెరీర్ ను ప్లాన్డ్ గా కొనసాగించింది. అప్పటి తమిళ్ ఇండస్ట్రీలోని అందరి ప్రముఖ హీరోల సినిమాల్లోనూ ఆమెకు ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ముఖ్యంగా విజయ్ కాంత్ నటించిన సినిమాల్లో ఆమెకు తరచుగా ఆఫర్స్ వస్తూండేవి. విజయకాంత్ తో ఆమెకున్న మంచి పరిచయం కారణంగానే దర్శకులు ఆమెను తీసుకునేవారు. ఆ టైమ్ లోనే బాలకృష్ణ హీరోగా నటించిన మొదటి చిత్రం సాహసమే జీవితం సినిమాలో ఆమెను హీరోయన్ గా సెలెక్ట్ చేసారు. ఆ సినిమాకి పి.వాసు, మహానది, గుణ సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంతాన భారతి కలిసి భారతి వాసు పేరుతో ఆ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇదిలా ఉంటే, విజ్జీ సినీ జీవితం ఎలా ఉన్నా, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో సాగేది. ఆమె అప్పట్లో తమిళ్ దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ ను గాఢంగా ప్రేమించింది. అతడికి పెళ్ళైనా సరే అతడి తో ఎఫైర్ కంటిన్యూ చేస్తూండేది. అతడ్ని తరుచుగా తనను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేసేది. కానీ అతడు జవాబు చెప్పకుండా తప్పించుకొనేవాడు.
అయితే ఆమెను దురదృష్టం మరో కోణంలో వెంటాడింది. 1996లో పూవే ఉనక్కాగ అనే సినిమా షూటింగ్ లో ఉండగా, ఆమెకు బ్యాక్ పెయిన్ ఎటాక్ అయింది. అది సివియర్ గా మారడంతో , ఆమె వెన్నుపూసకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, చెన్నై అపోలో హాస్పటిల్ లో ఆమెకు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది. లోపల ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిందని డాక్టర్లు చెప్పారు. మరి కొన్ని సర్జరీలు చేయడంతో ఆమెకు తాత్కాలిక పక్షవాతం వచ్చింది. దాంతో అపోలో హాస్పటల్ మీద ఆమె కేసు ఫైల్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కలగచేసుకోవడంతో ఆమెకు అపోలో వాళ్లు ముప్పై వేలు నష్ట పరిహారంగా చెల్లించారు. ఆ తర్వాత చేసిన మరో సర్జరీతో ఆమె వెన్నునెప్పి తగ్గిపోయింది. దీని ఫలితంగా ఆమెకు ఛాన్సులు కరువయిపోయాయి. విజయకాంత్ వల్ల ఒకటో రెండో సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. ఆమె హస్పటిల్ లో ఉన్న సమయంలో విజ్జి ప్రేమించిన దర్శకుడు ఎ.ఆర్ .రమేష్ వచ్చిపోతుండేవాడు. అప్పడు అతడ్ని విజ్జి తన పెళ్లిగురించి మరింత వత్తిడి చేసింది. తనుకు పెళ్లైందని , నీతో ఎఫైర్ మాత్రమే కొనసాగిస్తానని , విజ్జి మధ్యవర్తులతో ఖరాఖండిగా చెప్పేసాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన విజ్జి, 2000 సంవత్సరంలో చెన్నై మహాలింగపురంలో ఉన్న తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరిపోసుకొని ఆత్మహత్యచేసుకుంది. చనిపోయే ముందు రమేష్ తో తను మాట్లాడిన టెలిఫోన్ సంభాషణను రికార్డు చేసి , తన చావుకు అతడే కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. ఆ తర్వాత దర్శకుడు రమేష్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. అలా… కేవలం 34 ఏళ్ల ప్రాయంలోనే తను ప్రేమించిన వాడికోసం అసువులు బాసింది ఆ అందాల హీరోయిన్.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Rakul -Jacky Bhagnani: ఘనంగా నటి రాకుల్ వివాహం.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు?

Published

on

Rakul -Jacky Bhagnani: సినీనటి రకుల్ ప్రీతి సింగ్ ఫిబ్రవరి 21వ తేదీ తన ప్రియుడు నటుడు జాకీ భగ్నానితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారకంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇలా తమ ప్రేమ విషయాన్ని తెలియజేసినటువంటి ఈ జంట ఎంతో స్వేచ్ఛగా ప్రేమ పక్షులుగా తిరుగుతూ వచ్చారు.

ఇలా ఇన్ని రోజులు ప్రేమ పక్షులుగా విహరించినటువంటి ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. వీరి వివాహం గోవాలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది 45 ఎకరాల రిసార్ట్ లో మూడు రోజులపాటు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో రకుల్ పెళ్లి వేడుకలు జరిగాయి.

ఇలా వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయని తాజాగా రకుల్ షేర్ చేసిన పెళ్లి ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. పెళ్లి తర్వాత ఈమె తన భర్త జాకీ తో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాంప్రదాయమైనటువంటి పెళ్లి దుస్తులను వీరిద్దరూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. వీరి పెళ్లి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించినటువంటి దుస్తులను ధరించారు.

Advertisement

సాంప్రదాయ దుస్తులలో..

ఈ పెళ్లి వేడుకలలో రకుల్ పింక్ కలర్ లెహంగా ధరించగా జాకీ వైట్ కలర్ కుర్తాలో కనిపించారు. ఇలా పెళ్లి పీటలపై వీరిద్దరూ ఎంతో నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా వీరిద్దరూ పెళ్లి తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అనంతరం జాకి తన భార్య రకుల్ పై ఎంతో ప్రేమగా ముద్దు పెడితే ఫోటోలకు ఫోజులిచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Varun Tej: ఆ పని చేస్తే నన్ను చంపేస్తారు.. వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు!

Published

on

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా మార్చి ఒకటవ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నటుడు వరుణ్ రిపోర్టర్స్ నుంచి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురయింది.

మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్రలలో నటించాలనే ఆలోచనలో ఉన్నారా అనే ప్రశ్న ఈయనకు రిపోర్టర్ నుంచి ఎదురయింది ఇలా ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ నేను కనుక అలా నటిస్తే నన్ను కొట్టి చంపేస్తారు అంటూ వరుణ్ తేజ్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

పవన్ సినిమాలో విలన్..

ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మెగా హీరో సినిమాలో మరో మెగా హీరో విలన్ గా నటించాలని ఏ ఒక్కరు కూడా కోరుకోరు. పవన్ కళ్యాణ్ బాబాయ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం తాను ఎదురుచూస్తున్నాను కానీ ఇలా విలన్ గా చేయాలని అసలు కోరుకోవడం లేదు అంటూ వరుణ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: ఒక వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ కీర్తి.. దారుణంగా ఉందంటూ?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హైదరాబాద్లో ఫుట్ పాత్ పై ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఏకంగా సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ పాపులారిటీతో ఏకంగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అత్యంత తక్కువ ధరలకు ఎంతో రుచికరమైనటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కడుపునిండా భోజనం పెడుతూ అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఈమె పాపులర్ అయ్యారు ఈమె గురించి ఎన్నో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తూ తన గురించి చెప్పడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఈమె వద్ద టెస్ట్ చేయడం కోసం వచ్చేవారు.

ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గురించి తాజాగా బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ కీర్తి తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కలసి కుమారి ఆంటీ వద్ద భోజనం చేయడానికి వెళ్ళారు. అయితే వీరు వెళ్లిన సమయంలో కుమారి ఆంటీ లేదని 170 రూపాయలకు వైట్ రైస్ చికెన్ కర్రీ తిన్నామని భోజనం ధర చాలా ఎక్కువగా ఉందని ఈమె తెలిపారు.

Advertisement

రుచి పెద్దగా లేదు…

ఇక ఆ ఫుడ్ తినడానికి పెద్దగా రుచి లేదని దారుణంగా ఉందని తెలిపారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు తినాలనిపించక పడేసామని మరో ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి అక్కడ భోజనం చేశామని అది కాస్త బెటర్ గా ఉందని ఈమె తెలిపారు. కుమారి ఆంటీ కంటే నేనే వంట బాగా చేస్తానని కీర్తి తెలిపారు. ఇలా కీర్తి కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగాలేదు అంటూ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెకు మద్దతు తెలుపుగా మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బపడిందని చెప్పాలి


Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!