స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో పలువురిని స్టార్స్‌గా మార్చేసింది. ఎవరికి తెలియని కత్తి మహేష్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు, ఒకటి రెండు సినిమాల్లో నటించిన ప్రిన్స్ స్టార్ అయ్యాడు.
ఇక బిగ్‌బాస్ ముందే తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కత్తి కార్తీక గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంతా మాట్లాడుకుంటున్నారు.
వి6 ఛానెల్‌లో టాక్ షోల ద్వారా కాస్త గుర్తింపు ఉన్న కత్తి కార్తీక బిగ్‌బాస్ షో కారణంగా ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దాదాపు అయిదు వారాల పాటు బిగ్‌బాస్ ఇంట్లో కత్తి కార్తీక కొనసాగిన విషయం తెల్సిందే. ఆమె ఎవ్వరి జోలికి వెళ్లకుండా, తన పనేంటో తాను చేసుకుంటూ, అందరితో సమానంగా వ్యవహరించేది.
అందువల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు ఆమెను అభిమానించారు. అందుకే ఆమె ఎక్కువ వారాలు ఉండగలిగింది. ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకుల హృదయాలను కూడా ఆమె గెలుచుకున్న కారణంగానే ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. రెండు లేదా మూడవ వారంలోనే ఆమె వెళ్లి పోతుందని భావించారు. కాని షాకింగ్ ఆమె చాలా వారాలే కొనసాగింది.
ఇక బిగ్‌బాస్ ఇంటి నుండి వెళ్లి పోయిన తర్వాత అందరు కూడా మీడియాలో తెగ కనిపిస్తున్నారు. ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే కత్తి కార్తీక కూడా పలు ఛానెల్స్‌కు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అన్ని ఇంటర్వ్యూలను చూసిన తర్వాత, ఆమె బిగ్‌బాస్ జర్నీ అంతా పరిశీలిస్తే ఆమె భర్త నుండి విడిగా ఉంటుందని అర్థం అవుతుంది.