మనం వాడే గొట్టపు మాత్రలు వెజ్జా? నాన్ వెజ్జా?.. అందరూ తెలుసుకోవాల్సిన విషయం!!

0
914

అందరూ తెలుసుకోవాల్సిన విషయం

మనకు ఏ చిన్న జబ్బు చేసినా డాక్టర్ ని సంప్రదిస్తాం. ఆ డాక్టరు మనల్ని పరీక్షించి, కొన్ని టాబ్లెట్లు, టానిక్ లేదంటే కాప్సుల్స్ మందులుగా రాసి వాడమంటారు. మనం వాడేసి పారేస్తాం. మనందరం ఇప్పటివరకు ఎన్నో గొట్టపు మాత్రలు వేసుకునే ఉంటాం. సాధారణంగా అల్లోపతీ, ఆయుర్వేదంలో ఈ గొట్టపు మాత్రలు ఎక్కువగా వాడుతారు. ఈ గొట్టపు మాత్ర లోపల అసలు మందు మిశ్రమాన్నినింపుతారు. కానీ పైనుండే ఈ గొట్టపు మాత్ర మాత్రం మాంసాహారమేనట. ఈ కాప్సుల్ లేదా గొట్టపు మాత్రని గెలాటిన్ తో తయారు చేస్తారట. జంతువుల ఎముకలు, కీళ్ళు ఇతర భాగాలను బాగా ఉడికించడం ద్వారా గెలాటిన్ తయారవుతుంది. దీన్ని బట్టి గొట్టపు మాత్ర మాంసమే అని చెప్పొచ్చు. అయితే…

మాంసాహార పదార్థంతో గొట్టం తయారీ వల్ల.. ఈ గొట్టపు మాత్రలలో రోగకారక వైరస్ లు ఉండే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇవి ఎక్కువగా వాడితే కడుపు నొప్పి, విరేచనాలు వచ్చే ప్రమాదముకూడా ఉందట. అందుకే ఈ గొట్టపు మాత్రలని కూడా ఏ హానీ కలగని పదార్థాలతో తయారు చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు మతపరమైన ఆచారాలను కూడా విశ్వాసం లోకి తీసుకుని, పూర్తి స్టాయి వెజ్ కాప్సుల్ ని తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తు౦దట. మొక్కలు, చెట్లనుంచి తీసిన గుజ్జు లాంటి పదార్తం సెల్యులోజ్ ద్వారా ఈ కాప్సుల్స్ తయారు చేసే విధి విధానాలను, నిబంధనలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఔషధ రంగ నిపుణులకు సూచించిందట. అందుకోసం ఔషధ శాఖ ఇప్పటికే ఒక కమిటీని కూడా వేసిందట. అయితే ఎక్కువగా సౌందర్య సాధనాల్లో వాడే ఈ గెలాటిన్ చాలా చవక ధరకే లభిస్తుందట. కానీ మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇక ముందు వెజ్ కాప్సుల్స్ తయారీకే కేంద్రం మొగ్గు చూపుతోందట.