Connect with us

Featured

రక్తం గ్రూపుని బట్టి వ్యక్తుల గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

Published

on

వ్యక్తి తల రాతను బట్టి వ్యక్తిత్వాలు ఉంటాయని తెలుసు. ఆకారాన్ని బట్టి వ్యవహరిస్తారని తెలుసు. ఆఖరికి నిద్రపోయే విధానాన్ని బట్టి వారి వ్యక్తిత్వాలు ఉంటాయని కూడా తెలుసు. ఇక జోతిష్యం సంగతి కూడా తెలుసు కానీ రక్త వర్గాలను బట్టి వ్యక్తులుంటారా? కానీ ఇది నిజమనే చెప్తున్నారు నిపుణులు. అదికూడా పరిశోధనల ద్వారానే దీన్ని ధ్రువపరిచామని కూడా వారు తెలిపారు. కాబట్టి ప్రతి వ్యక్తికీ ఏదో ఒక కోణం.. ఆలోచనా విధానం ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఓ బ్లడ్‌గ్రూప్ కూడా ఉంటుంది. రక్తం చెప్పే మనస్తత్వాల గురించి ఏమాత్రం లేట్ చేయకుండా తెలుసుకుందామా…

Advertisement

ఆ బ్లడ్‌గ్రూప్‌లోని హిమోగ్లోబిన్ శాతమెంత? ప్లాస్మా పర్సెంటేజీ ఏంటీ? వంటి విషయాలు పక్కనబెడితే పర్సనాలిటీ.. మనసు కోణంలోనే ఆలోచిస్తే రక్తవర్గ చరిత్ర తెలుసుకోవచ్చు! మనలో చాలామంది దానగుణాలు చేసే వ్యక్తిత్వం కలవారుంటారు. ఇతరులను చూస్తే ఓర్వలేని వారుంటారు. ఒకరైతే వేరొకరి కోసం జీవితాన్నే త్యాగం చేసేవాళ్లు. మరొకరు ఎప్పటికీ.. ఎవ్వరికీ అర్థంకానివాళ్లు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. ఈ చర్యలన్నీ శరీరంలో ప్రతిక్షణం సరఫరా అయ్యే ప్రతి రక్తం బొట్టుపై ఆధారపడి ఉంటుందనేదే ఆసక్తి.. ఆశ్చర్యం కలిగించే విషయం. అందుకే ఇవి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటంలో తప్పు లేదు!

బ్లడ్ గ్రూపులను బట్టి మనస్తత్వం ఉంటుందని మొదటగా జపనీయులు కనిపెట్టారు. ఈ విషయం శాస్త్రీయంగా ధ్రువపడ లేదు కానీ గణాంకాల ప్రకారం సరి అవుతున్నట్లు చెప్తున్నారు మానసిక.. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నిపుణులు. దక్షిణ కొరియాలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పెళ్లి సంబంధాలు.. ఉద్యోగాల విషయంలో రక్త వర్గాలను ప్రామాణికంగా పాటిస్తున్న దేశాలూ.. సంస్థలూ ఉన్నాయి! రక్తాన్ని బట్టి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ పరంగా మనకు తెలిసిన వారి మనస్తత్వాన్ని పరిశీలిస్తుండటం సరదాగా అనిపిస్తుంది కదా!

Advertisement

క్రూరంగా ప్రవర్తించేవాళ్లను పచ్చినెత్తురు తాగేవాళ్లు అని అంటుంటారు. కానీ ఆయనది ఏ గ్రూపో తెలిస్తే తన క్రూరత్వాన్ని మార్చుకోవచ్చుగా అని ఆలోచించే.. రక్త వర్గాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. మనిషికి.. మనస్తత్వానికి ఇంత సంబంధం ఉన్నప్పుడు.. వాటికంత ప్రాధాన్యం ఉన్నప్పుడు కచ్చితంగా ఎవరికైనా తమ జాతకమేంటో తెలుసుకోవాలని ఉంటుంది. అయితే అంతకంటే ముందు రక్తంలో ఎన్ని వర్గాలు ఉంటాయి.. అసలు రక్తం అంటే ఏమిటో బ్రీఫ్‌గా తెలుసుకుందాం! ఇతిహాసాల్లో.. చరిత్రలో.. సాహిత్యంలోనూ రక్తం ప్రస్తావన ఉంది.

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణ సందర్భంలో.. దుశ్శాసునుడి చంపి రక్తం తాగుతానని భీముడు.. ఆ నెత్తురును తల నూనెగా రాసుకుంటానని ద్రౌపది శపథం చేస్తారు! అంటే మనిషి రక్తానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్టేట్స్ వేర్వేరు వ్యక్తుల్లో వేరుగా ఉంటాయి. రక్తంలో ముఖ్యంగా నాలుగు వర్గాలు ఉన్నాయి. ఏ, బీ, ఏబీ, ఓ. తిరిగి వీటిలో రీసస్ (ఆర్‌హెచ్) ఫ్యాక్టర్ ఆధారంగా పాజిటివ్ లేదా.. నెగెటివ్‌గా వర్గీకరించారు. ఓ నెగెటివ్ గ్రూప్ రక్తం విశ్వదాతగానూ.. ఏబీ పాజిటివ్ విశ్వ గ్రహీతగానూ పేర్కొంటారు. మానవ శరీర బరువులో దాదాపు 7 శాతం వరకు రక్తం ఉంటుందని పరిశోధకుల అంచనా!

Advertisement

రక్తం గురించీ ఒకమాట! రక్తం ఉపయోగం.. దాని స్థితి ఏంటో ఒకమాటలో తెలుసుకోవాలని లేదా? అయితే చదవండి. రక్తం ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడుతుంది. దాదాపు 473 మిల్లీ లీటర్ల రక్తం ద్వారా ముగ్గురిని ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడుతుంది. ఒక సగటు వయోజన వ్యక్తి బరువులో 65 నుంచి 80 కిలో బరువులో దాదాపు రక్తం 4.7 నుంచి 5.5 లీటర్ల వరకు ఉంటుంది. మనిషి జీవిత కాలంలో గుండె దాదాపు 1.5 మిలియన్ బారెల్స్ రక్తాన్ని సరఫరా చేస్తోంది. గుండె ప్రతి హృదయ స్పందనలో దాదాపు 55 నుంచి 80 మిల్లీ లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది.

ఏ పాజిటివ్:
వీరు నాయకత్వ లక్షణాలు కలవారు. ఏ- పాజిటివ్ రక్తం ఉన్న వ్యక్తులు బయటకు బక్కచిక్కగా.. సాధారణంగా కనిపించొచ్చు. కానీ వాళ్లలో బ్లడ్‌గ్రూప్ తెలిస్తే అసలు విషయం కనుక్కోవచ్చు. నాయకుడంటే పరిపాలనాదక్షుడు. సన్మార్గంలో నడిపేవాడు. ప్రభావితం చేసేవాడు. నాయకత్వాన్ని వెతికి నేర్వడం కంటే.. అది మన రక్తంలో ఉంటుందని గ్రహించాలేమో!

Advertisement

ఏ నెగెటివ్:
వీరు కష్టపడే మనస్తత్వం కలవారు. కష్టం కంటే పనిని ఇష్టపడేవారు అనొచ్చు. చూసి కష్టాన్ని ఎలా ఇష్టపడాలో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మెరిసేదంతా బంగారం కాదు.. మోగేదంతా కంచు కాదు అని తెలుసుకుంటే బావుంటుంది. ఎందుకంటే బంగారంలా కనిపిస్తుందని వేరేవాళ్ల మెరుపు కోసం.. మెప్పు కోసం కాకుండా కష్టపడుతూ స్వయంగా ఎదగడం నేర్చుకోవడం కోసం.

బీ పాజిటివ్:
త్యాగం చేసే మనస్తత్వం కలవారు. త్యాగాన్ని కూడా త్యాగం చేసేవాళ్లన్నమాట! బీ పాజిటివ్‌గా ఉంటేనే ఇది సాధ్యం అన్నమాట. రక్తమే కాదు.. మన మనసూ బీ పాజిటివ్‌గా ఆలోచిస్తే ఇక నువ్వెన్ని త్యాగాలు చేసినా సంక్షోభం రాదు. నీ మనసు నిండా సంతృప్తి నిండి ఉంటుంది. మంచి వ్యక్తిగా.. తెలివితేటలుకలవానిగా.. నిజాయితీ కలవానిగా ఎంత త్యాగం చేసినా మనసు కరగని వెన్నలానే ఈ బ్లడ్ గ్రూప్ వారు ఉంటారన్నమాట.

Advertisement

బీ నెగెటివ్:
వీరు పరిస్థితులతో కాస్త సర్దుబాటు కాలేరు. వీళ్ల రక్తమే నెగెటివ్ కదా.. అని కాదు.. బ్లడ్‌గ్రూప్ మిమ్మల్ని ఇలానే ఉండమని చెప్పట్లేదు. కూడా మారొచ్చు.. పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.. మార్చేస్తే మారుతారు సామీ అని చెప్తోంది. సర్దుబాటు అవ్వడం అనేది రక్తాన్ని.. దాని గ్రూపును బట్టి ఉండకపోవచ్చు.. చుట్టూ ఉన్న మనుషులు.. పరిస్థితులను బట్టే ఉంటుంది కదా.. అందుకే బీ నెగెటివ్ వారు సర్దుబాటు కాలేరు అనేది సర్వేలు చెబుతున్నా.. ఇందులో పూర్తి వాస్తవం లేకపోవచ్చు.

ఓ పాజిటివ్:
ఈ బ్లడ్ గ్రూప్‌వారు చురుకైన మనసును కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ బద్దకిస్తే అది మనకే ప్రమాదం. నువ్వు చురుకుగా ఉంటే.. నీ జాతకాన్ని మార్చే మంత్రదండమేదీ లేదు. మనలో కొంతమంది మానవ సంబంధాల విషయంలో కూడా అలసత్వంగా.. నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మనుషులు దూరంగా ఉంటే ఏం ప్రయోజనం. మనసులు దగ్గరగా ఉండేలా చురుగ్గా ఉంటే ఇతరుల మనసుల్ని గెలవడమే కాదు.. మనం కూడా ఆనందంగా ఉండొచ్చు. ఇది ఓ-పాజిటివ్ వాళ్లకు మెండుగా ఉంది కాబట్టి నో టెన్షన్!

Advertisement

ఓ నెగెటివ్:
వీరు కాస్త అర్థంకాని మనస్తత్వం కలవారు! అయినా మీరే చెప్పండి.. అక్క మనది అయితే.. బావ మనోడు కాడా?.. అవుతాడు కదా. అలాగే వీరిలో అంత ఈజీగా అర్థంకాని తత్వం కాస్త ఉన్నా.. ఈ సెల్ఫీల కాలంలో చల్తాహై. ఓ-నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు ప్రతీదాన్ని నెగెటివ్‌గా ఆలోచిస్తారనడం వాస్తవం లేకపోవచ్చు. ఇదే మీ బ్లడ్ గ్రూప్ అయితే.. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.. మీలోని క్వాలిటీస్ ఓసారి కర్టె చేసుకోండి. ఒక వేళ కాస్తో కూస్తో.. అవకాశం ఉంటే.. మీ మనస్తత్వం కాస్త మార్చుకోండి. ఎందుకంటే.. మీ నెగెటివ్ రక్తానికి ఎందుకు నెగెటివ్ పేరు తేవడం.. బీ పాజిటివ్ యార్!

ఏబీ పాజిటివ్:
వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టమట! ఇతరులకు సహాయం చేసేందుకు పుట్టారట వీళ్లు! ఈ గ్రూప్‌వాళ్లలో రెండు లక్షణాలున్నాయి. రెండూ వేటికవే భిన్నం. ఒక వ్యక్తిని ఏదో ఒకరకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు ఎంత అర్థం చేసుకున్నా అర్థం కారు. అందుకే మనలో చాలామంది వీడెంతకూ అర్థమవడురా బాబూ అని పెదవి విరుస్తుంటారు కూడా! ఇది ఒక లక్షణం అయితే.. ఇతరులకు సహాయం చేయడం వీరిలోని రెండో లక్షణం! కానీ ఇది మొదటిదానికి పూర్తిగా భిన్నం! మొదటిదాంట్లో నెగెటివ్ శాతం ఎక్కువగా ఉంటే.. రెండో లక్షణంలో పాజిటివ్ శాతం పుష్కలంగా ఉంది! కాబట్టి మీలో ఎవరైనా ఏబీ పాజిటివ్ ఉన్నవాళ్లుంటే వాళ్లను రెండు విధాలుగా అర్థం చేసుకోండి!

Advertisement

ఏబీ నెగెటివ్:
మెండైన తెలివి తేటలు కలిగి ఉంటారు! చూడటానికి చలాకీగా.. చురుగ్గా ఉంటారు. అందరితో చక్కగా మాట్లాడతారు. కమ్యూనికేషన్ గ్యాప్‌కూడా వీళ్ల దరి చేరదు. మన తెలివే మనల్ని కాపాడుతుంది. తెలివి లేకపోతే సకల సౌకర్యాలున్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏబీ నెగెటివ్ వాళ్లు ఇలానే తమ తెలివితేటల్ని ప్రదర్శిస్తూ భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదిగేలా ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇతరులను కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే ఏబీ నెగెటివ్ గ్రూప్ వాళ్లు అన్నీ తెలిసిన తెలివిమంతులు కదా!

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం.. అదే లక్ష్యమా?

Published

on

Pawan Kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈయన ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకొని మరి బిజెపి అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగారు. ఈ విధంగా ఏపీలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఈయన పోటీ చేసిన ప్రతి ఒక్క చోట అద్భుతమైన మెజారిటీతో గెలిచారు.

Advertisement

ఇలా ఏపీలో 100% విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఎంతో కీలకంగా మారారు.దీంతో పవన్‌ కల్యాణ్ క్రేజ్‌ ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ప్రధాని మోదీ ఉపయోగించుకోవాలని ప్లాన్‌ చేసింది. త్వరలోనే మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే బాగుంటుందని మోడీ సర్కార్ భావించినట్టు తెలుస్తోంది.బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహావికాస్‌ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మహావికాస్‌ అఘాడీని ఎదురించి ఎలాగైనా తమ అధికారాన్ని అందుకోవాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది.

ఎన్నికల ప్రచారంలో పవన్..
ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.ఇదే విషయమై పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ అధిష్ఠానం సంప్రదిస్తే ఓకే కూడా చెప్పేశారు. దీని ప్రకారం నవంబర్‌ 16, 17వ తేదీల్లో పవన్‌ కల్యాణ్‌ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మహారాష్ట్రలో ఎక్కడైతే తెలుగు వారు అధికంగా ఉంటారో ఆయా ప్రాంతాలలో పవన్ పర్యటించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ashok Galla: నమ్రత అత్తయ్య వల్లే హీరో అయ్యాను.. అశోక్ గల్లా కామెంట్స్ వైరల్!

Published

on

Ashok Galla: ఘట్టమనేని కుటుంబం నుంచి ఇది వరకే హీరోగా మరో వారసుడు ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ప్రముఖ మాజీ రాజ్యసభ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈయన తన రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Advertisement

దేవకీ నందన వాసుదేవ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అశోక్ ఫ్యామిలీ గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు భార్య నమ్రత గురించి ఈయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఒక మాటలో చెప్పాలి అంటే నమ్రత అత్తయ్య కారణంగానే నేను హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని అశోక్ వెల్లడించారు. నేను ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నాను ఆ సమయంలో నమ్రత అత్తయ్య నాకు ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు ఇండస్ట్రీలోకి వెళ్తే ఎలా ఉండాలి ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే విషయాల గురించి నాకు తెలియచేస్తూ నన్ను బాగా సపోర్ట్ చేశారు.

సపోర్ట్ చేస్తుంది..
నేను హీరోగా వద్దామనుకునే ముందు బాగా జుట్టు పెంచి పోర్ట్ ఫోలియో తీయించుకుందాం అనుకున్నాను. సింపుల్ గా చెన్నై వెళ్లి తీసుకుందాం అనుకున్నాను. కానీ నమ్రత అత్త ముంబై వెళ్లి నా హెయిర్ స్టైలింగ్ చేయించుకొని ప్రాపర్ అఫీషియల్ పోర్ట్ ఫోలియో చేపించమని చెప్పింది. ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ సపోర్ట్ కూడా చేసిందని అశోక్ వెల్లడించారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Kirak RP: రోజా నువ్వు ఒక్కదానివే ఆడదానివా.. కి రోజా పై కిరాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు!

Published

on

Kirak RP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన విషయం పక్కన పెట్టి సోషల్ మీడియా వేదికగా వారిని హింసించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని వైకాపా నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మహిళా మంత్రి ఆర్కే రోజా ఇటీవల సోషల్ మీడియా వేదికగా తనని తన కూతురిని ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఒక వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియో పై కిరాక్ ఆర్పీ స్పందించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ.. మహిళనీ కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని రోజ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గురించి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఒక సాటి మహిళగా నువ్వు అక్కడే ఉండి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మీరొక్కరే ఆడవారా మీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా అంటూ ఆర్పీ ప్రశ్నించారు.

నేను డబ్బు కోసం ఎవరిని తిట్టడం లేదు నేను పక్కాగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అభిమానిని ఇటీవల రెండుసార్లు లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఫలానా వాళ్ళని బూతులు తిట్టమని నన్ను ప్రోత్సహించలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడే నేను ఎవరికీ భయపడలేదు మీకు చెమటలు పట్టించాను. ఇప్పుడు కూడా తాను ఎవరికి భయపడనని ఆర్పీ తెలిపారు.

భయపడేదే లేదు..

Advertisement

రోజాని నేను పంది అన్నప్పుడు అంబంటి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మరి రోజా పవన్ కళ్యాణ్ గాడిద అని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ అంబంటికి కూడా ఈయన ప్రశ్నలు వేశారు.నీవు ఒక జంతువును వాడితే.. నేను ఒక జంతువుతో పోల్చకూడదా? అని కిర్రాక్ ఆర్పీ తెలిపాడు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!