సొంతవాళ్ల చేతిలో మోసపోయిన ఒకనాటి తమిళ అందాల హీరో కార్తిక్..

0
1167

సొంతవాళ్ల చేతిలో మోసపోయిన ఒకనాటి తమిళ అందాల హీరో కార్తిక్..
ఈ పేరు ఎయిటీస్ లో తమిళ్ ఇండస్ట్రీలో ఒక ప్రకంపనం. ప్రేమకథా చిత్రాలతో యూత్ గుండెల్లో కొలువైన అద్భుత హీరో . భారతిరాజా అలైగళ్ ఒయివిదవిల్లై సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. దాని రీమేక్ సీతాకోక చిలుక ద్వారా తెలుగు లో కూడా మురళి పేరుతో పరిచయం అయ్యాడు. అన్వేషణ, అనుబంధం, అభినందన, వీరభద్రుడు , ఓం లాంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి పాప్యులారిటీ తెచ్చుకున్నాడు. కార్తిక్ తండ్రి ఆర్ . ముత్తురామన్ ఒకప్పటి తమిళ్ ఇండస్ట్రీలో పెద్ద నటుడు. నవరస తిలగం బిరుదుతో తమిళ్ జనాలు పిలుచుకొనేవారు.
ఎయిటీస్ , నైంటీస్ లో కార్తిక్ తమిళ్ లో మంచి మంచి సినిమాలు చేసాడు. అవి తెలుగులో కూడా విడుదలై మంచి సక్సెస్ సాధించాయి. కొంత కాలం పాటు సౌత్ లో చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా, 2000 నుంచి ఆయన సినిమాల గ్రాఫ్ పడిపోయింది. చేసిన సినిమాలన్నీ రిలీజ్ కాక, మొదలెట్టిన సినిమాలు అర్ధంతరంగా ఆగిపోయి, తీసుకొన్న అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వవల్సిన స్థితిలో కూరుకుపోయాడు కార్తిక్. కార్తిక్ తండ్రి చెన్నైలో బోలెడంత ఆస్థి కూడబెట్టాడు. దానికి తోడు ఆయన పూర్వికుల నుంచి సంక్రమించిన ఆస్తుల్ని కూడా పిల్లలకు పంపకం చేసాడు . చెన్నైలో తన తండ్రి ద్వారా సంక్రమించిన ఇంట్లోనే ఉండేవాడు కార్తిక్. అయితే తన అన్నదమ్ములతో ఎలాంటి గొడవ జరిగిందో తెలియదు కానీ, కార్తిక్ అన్నలు ముగ్గరూ కార్తిక్ ను చెన్నై ఇంటినుంచి గెంటేసినట్టు తెలుస్తోంది. సినిమాల్లో వేషాలు తగ్గిపోయి , ఆర్ధికంగా చితికిపోయిన కార్తిక్ కు ఈ సంఘటన చాలా బాధించింది. కొన్ని కోట్ల ఆస్థి తనకు రావల్సి ఉండగా, అతడి ముగ్గురు అన్నలు తనని మోసం చేసారంటూ చెన్నై కోర్ట్ లో కేసు వేసాడు. ఆర్. ముత్తురామన్ కష్టార్జితం తో పాటు పిత్రార్జితం కూడా కలిపితే కొన్ని కోట్లు విలువైన ఆస్థిపాస్తులు ఆయన నలుగురు పిల్లలకు సమానంగా పంపకం జరగాలి చట్టప్రకారం. ఒక వేళ కార్తిక్ తన రావల్సిన వాటాను ముందే తన సినిమాల కోసం కానీ ఖర్చుచేసేసి ఉండుంటే అతడి అన్నలు చేసిన పని సరైనదే అని అనుకుంటున్నారు జనం. మరి కార్తిక్ ఈ కేసు గెలుస్తాడో లేదో చూడాలి.