19 ఆక్టోబర్ ఈ పరిష్కారం చేస్తే బిచ్చగాడైన కుబేరుడు అవ్వాల్సిందే?

0
924

పూజ సమయంలో శంఖం మరియు గంట అన్ని గదుల్లో మ్రోగించాలి.ఇలా చేస్తే ఇంట్లో ఉన్న అన్ని ద్రుష్ట శక్తులు,దరిద్రం భయటకు వెళ్ళిపోతుంది,లక్ష్మి దేవి ఇంట్లోకి వస్తుంది.దీపావళి రోజున నూనె దీపాలను వెలిగించాలి.ఒక నూనె దీపాన్ని వెలిగించి అందులో ఒక లవంగాన్ని వేసి దగ్గరలో ఉన్న హనుమాన్ దేవాలయం దగ్గరకి వెళ్లి హనుమంతునికి హారతి ఇవ్వండి.దీపావళి రోజున శివునికి బియ్యం సమర్పించండి.బియ్యం వెలిగి ఉండకూడదు,అన్ని సంపూర్ణంగా ఉండాలి.పూజలో పసుపు రంగు గవ్వలు ఉంచండి.ఇలా చేస్తే లక్ష్మి దేవి తొందరగా ప్రసన్నం అవుతుంది.మీ ధన సంబంధిత సమస్యలు తీరుతాయి.పూజ సమయంలో పసుపు కుంకుమ కూడ పెట్టాలి.పూజ అయిపోయాక పసుపు కొమ్ముని మీరు డబ్బు దాచే చోట పెట్టాలి.

మీ దగ్గరలో లక్ష్మి దేవి గుడి ఉంటె వెళ్లి దీపావళి రోజు గులాబి సుగంధం కలిగిన అగరబత్తి లను దానం ఇవ్వాలి.దీపావళి రోజు అమావాస్య కాబట్టి రాగి చెట్టుకు నీరు పోయండి.ఇలా చేస్తే శని దోషం ,కాల సర్ప దోషం తొలిగిపోతాయి.పూజలో లక్ష్మి యంత్రం ,కుబెర యంత్రం ,శ్రీ యంత్రం తప్పక పెట్టాలి.రావి చెట్టు మొదట్లో నూనె దీపం వెలిగించి వెనుకకు తిరగకుండా రావాలి.ఒక పెద్ద దీపం వేసి దాని చుట్టూ తొమ్మిది నూనె దీపాలు పెట్టాలి.ఇలా చేస్తే లక్ష్మి దేవి మిమ్మల్ని వెంటనే అనుగ్రహిస్తుంది,అంతా మంచే జరుగుతుంది..!