Connect with us

General News

PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?

PM-CMs: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కల్లోలం కలిగిస్తోంది. అమెరికా, యూకే దేశాల్లో లక్షల్లో కేసులు వస్తున్నాయి. మరో వైపు ఇండియాలో కూడా కేసుల

Published

on

PM-CMs: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కల్లోలం కలిగిస్తోంది. అమెరికా, యూకే దేశాల్లో లక్షల్లో కేసులు వస్తున్నాయి. మరో వైపు ఇండియాలో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. గత కొన్ని రోజుల క్రితం దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 వేలకు తక్కువగానే ఉండేది.

Advertisement
PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?
PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?

కానీ ప్రస్తుతం కేసులు సంఖ్య వేల సంఖ్య నుంచి లక్షలకు చేరాయి. తాజాగా ఈరోజు 2.45 లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ఓమిక్రాన్ కేసులు కూడా పక్కలో బల్లెంలాగా పెరుగుతున్నాయి. 

PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?
PM-CMs: మోదీతో సీఎంల సమావేశం..! థర్డ్ వేవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?

కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠిన తరం చేశాయి. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వారాంతపు లాక్ డౌన్లు అమలు చేస్తున్నారు.


ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..

చాలా రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే 15-18 ఏళ్ల లోపు ఉన్న టీనేజర్లకు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ప్రికాషనరీ డోసులను కూడా వేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.  ఇదిలా ఉంటే.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నేడు భేటీ కానున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు. దీంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరవచ్చు. మరోవైపు వ్యాక్సిన్ కార్యక్రమాలను వేగం చేయాలని సీఎంలకు సూచించే అవకాశం ఉంది. ప్రస్తుతం పండగలు వస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుసరించాల్సి విధానాల గురించి ప్రధాని.. సీఎంలకు దిశానిర్థేశం చేయనున్నారు. ఆక్సిజన్ సదుపాయాలు, బెడ్లను సిద్దం చేసుకోవాలని సూచించే అవకాశం ఉంది.

Advertisement

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading

Featured

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Published

on

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Advertisement

Continue Reading

Featured

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

Published

on

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Advertisement

Continue Reading
Advertisement

Trending

Don`t copy text!