Connect with us

Featured

Ali -Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో దూరం పెరగడానికి అదే కారణం… ఓపెన్ అయిన అలీ… వీడియో వైరల్!

Published

on

Ali -Pawan Kalyan: అలీ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలీ ఎంతో మంది సీనియర్ సెలబ్రెటీలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ వారి దగ్గర నుంచి సమాధానాలు రాబట్టారు.ఇకపోతే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో భాగంగా అలీ అతిథిగా వ్యవహరించారు.

ఇక ఈ కార్యక్రమంలో సుమ అలిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఆయన నుంచి సమాధానాలు రాబట్టింది.ఈ సందర్భంగా ఆలీ తన చిన్నప్పటి విషయాలను అలాగే తన తొలిప్రేమ విషయాలను గురించి కూడా సుమ కార్యక్రమంలో బయటపెట్టారు.ఇలా ఇద్దరు కలిసి ప్రేక్షకులను బాగా సందడి చేయబోతున్నారని తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సుమా అలీని ప్రశ్నిస్తూ మీకు పవన్ కళ్యాణ్ కు మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అలీ సమాధానం చెబుతూ తనకు పవన్ కళ్యాణ్ కి మధ్య గ్యాప్ రాలేదని గ్యాప్ సృష్టించారని సమాధానం చెప్పారు. ఇక తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో కూడా ఆలీ తెలియచేశారు.

Advertisement

Ali -Pawan Kalyan: కొందరి ప్రమేయం వల్ల పవన్ అలీ మధ్య దూరం పెరిగిందా…

ఈ విధంగా ఈ కార్యక్రమంలో తనకు పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం పెంచారని చెప్పడంతో వీరిద్దరి మధ్య దూరం పెంచిన వ్యక్తులు ఎవరు అనే విషయం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 19వ తేదీ ప్రసారం కానుంది.పూర్తి ఎపిసోడ్ ప్రసారమైనప్పుడు పవన్ అలీ మధ్య దూరం పెరగడానికి గల కారణం ఏంటి ఎవరు దూరం పెంచారు అనే విషయాలన్నీ కూడా తెలియనున్నాయి.

Featured

Rajamouli: వరుస ఫ్లాపులు వచ్చిన ఐరన్ లెగ్ అని పిలిచినా.. ఆ హీరోయిన్లనే తీసుకుంటాం: రాజమౌళి

Published

on

Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.

ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను.
మగధీర..

Advertisement

ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.

Advertisement
Continue Reading

Featured

Venu Swamy: బిగ్ బాస్ లోకి వేణు స్వామి… భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న జ్యోతిష్యులు!

Published

on

Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

లక్షల్లో రెమ్యునరేషన్..

Advertisement


దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Kumari Aunty: కుమారి ఆంటీని కలిసిన సోను సూద్… నేనున్నానంటూ ధైర్యం చెప్పిన హీరో!

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

మహిళా సాధికారత..
మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!