Actor Mahesh : సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడి ఒకవైపు జబర్దస్త్ చేస్తూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ రంగస్థలం, మహానటి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేష్ . జబర్దస్త్ మహేష్ కాస్తా రంగస్థలం మహేష్ గా గుర్తింపు తెచ్చుకుని అందరు స్టార్ హీరోల సరసనా నటించి కెరీర్ లో ముందుకు పోతున్న రంగస్థలం మహేష్ ఇటీవలే విరూపాక్ష సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించారు. ఇక తాను ఎదుర్కొన్న కష్టాలను, చేదు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా ఆస్తులు అవే…
జీరో నుండి మొదలై ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కమెడియన్ గాను మంచి అవకాశాలను అందుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న రంగస్థలం మహేష్ ఇపుడిపుడే కెరీర్ లో స్థిరపడుతున్నారు. అయితే తాను కొంచెం సినిమాల్లో డబ్బులు రాగానే ఊర్లో ఇల్లు కట్టించుకున్నానని తెలిపారు. ఊరి నుండే మొదట్లో హైదరాబాద్ కి బస్ లో వస్తూ సినిమాల్లో నటించి మళ్ళీ అవకాశాలు లేనపుడు ఊరికి వెళ్లిపోయేవాడిని అంటూ తెలిపారు.

ఇక కారు అవసరం రాలేదని ప్రస్తుతానికి షూటింగ్స్ కోసం ప్రొడక్షన్ వాళ్ళు పంపే కారునే వాడుతున్నాను, ఇప్ప్పటికి అవసరం లేదు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయని ఆడంబరాలు చేస్తే అంతే అందుకే పెద్దగా డబ్బు ఖర్చు పెట్టను ఆడంబరాలకు, స్టేటస్ అంటూ పోను అంటూ చెప్పారు మహేష్. ఉన్న ఆస్తి సొంతూరులో ఇల్లు కొంచం పొలం అంతే అంటూ చెప్పారు.