Kriti Shetty: చైతూ నా బంగారు రాజు… చైతన్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి శెట్టి!

0
38

Kriti Shetty: ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈమె నటించిన వరుస మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి అనంతరం మూడు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కెరియర్ కాస్త ఇబ్బందులలో పడింది అని చెప్పాలి.

ఇలా కృతి శెట్టి తాజాగా నాగచైతన్య హీరోగా నటించిన కష్టాడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ కార్యక్రమాలలో భాగంగా కృతి శెట్టి నాగచైతన్య గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ ముందుగా ఈ సినిమాలో తనకు అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కస్టడీ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమాలో శివపాత్రికి రేవతినే కాదు అందరూ అమ్మాయిలు లవ్ లో పడిపోతారు. ఇక నాకు చైతన్య గారు ఎప్పుడు ఫేవరెట్ ఆయనే నా బంగారు రాజు ఆయనే నా శివ అంటూ కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kriti Shetty: కృతి శెట్టి ప్రేమలో పడిందా..


ఇక నేను చాలామంది నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. అలా నేను స్ఫూర్తి పొందినటువంటి వారిలో నాగచైతన్య గారు కూడా ఒకరు అంటూ ఈ సందర్భంగా చైతన్య గురించి ఈమె ఎంతో గొప్పగా చెప్పుతో ఆయనపై ప్రశంసల కురిపించారు. ఇలా నాగచైతన్య గురించి కృతి శెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొంపదీసి బేబమ్మ చైతన్య ప్రేమలో పడిందా ఏంటి ఇంతగా పొగడేస్తున్నారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.