Actress Himaja: బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హిమజ. ఇలా సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. అయితే బిగ్ బాస్ తర్వాత ఈమెకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హిమజ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వృత్తిపరమైన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన సినీ కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అలాగే బాడీ షేమింగ్ ట్రోల్స్ గురించి కూడా మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని అయితే మనం చేస్తున్న పనిలో నీతి నిజాయితీ ఉన్నపుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని తాను ముందడుగు వేశానని తెలిపారు. ఇక తన కళ్ళు బాలేవని నా నడక మగరాయుడులా ఉంటుందని చాలామంది తన గురించి బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు. అయితే నన్ను ట్రోల్స్ చేసిన వారు అనంతరం నన్ను నా నటనను చూసి తనపై ప్రశంసలు కురిపించారని తెలిపారు.

Actress Himaja: వారి చదువుల బాధ్యత నాదే..
ఇక సామాజిక సేవ గురించి మాట్లాడుతూ చాలా మంది బయట సామాజిక సేవ చేయడానికన్నా ముందుగా మన ఇంటిని చక్క పెట్టుకోవాలని తెలిపారు. అందుకే నేను నా కార్ డ్రైవర్ ముగ్గర ఆడపిల్లల బాధ్యతను తానే చూసుకుంటున్నానని తెలిపారు. వారు చదువుల బాధ్యత మొత్తం తనపైనే ఉంది అంటూ ఈ సందర్భంగా హిమజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.