Adhika Shravanam Effects : అధిక శ్రావణ మాసంలో శుభాకార్యాలు చేయవచ్చా… అసలు అధిక మాసం ఎలా ఏర్పడుతుంది…!

0
782

Adhika Shravanam Effects : పండితులు జనార్ధన చార్యులు ఆషాడం తరువాత వచ్చే అధిక శ్రావణ మాసం గురించి వివరించారు. అనేక సందేహాలను నివృత్తి చేసారు. మామూలుగా శ్రావణ మాసం వస్తుంది అనగానే లక్ష్మీదేవి ఆరాధన, మరోవైపు పెళ్లిళ్లు వంటి శుభకర్యాలు పండుగలతో కళకళలాడుతుంది. కానీ ఈసారి వస్తున్న శ్రావణ మాసం అధిక మాసం. ఈ నెల 18న అమావాస్య తరువాత ప్రారంభమయ్యే అధిక మాసం వచ్చేనెల 16 వరకు కొన సాగుతుందని జనార్ధన చార్యులు తెలిపారు. అయితే ఈ అధిక శ్రావణ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయొచ్చు వంటి విషయాలను ఆయన తెలిపారు.

పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు చేయరాదు…

మన కాలమానంను సంవత్సరాలు, నెలలు, ఋతువులు, తిధులు, పక్షాలు అంటూ లెక్కిస్తాము. అయితే రెండు రకాల గణనాలు ఇక్కడ ఉంటాయి. ఒకటి సౌర మానం, మరొకటి చాంద్ర మానం. సౌరమాన సంవత్సరానికి చాంద్రమాన సంవత్సరానికి పదకొండుంబావు రోజులు తేడా ఉంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. ఇదే మాదిరిగా చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇందువల్ల ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. చాంద్రమానంలో సూర్య గమనం లేని మాసాన్ని ‘అధికమాసం’ అంటాం. అంటే, సూర్యుడు ఆ నెలలో ఏ రాశిలోనూ కొత్తగా ప్రవేశించడు.

ఇలా రెండు సార్లు చంద్రుడు తిరిగినా ఆర్యుడి గమనంలో మార్పు రాకపోతే అది అధికమాసం అవుతుంది అంటూ తెలిపారు. అధికంగా వచ్చే అధికమాసంలో శుభకార్యాలకు, ముఖ్యమైన దైవకార్యాలకు పనికిరాదని మన పెద్దలు నిషేధించారు. సూర్యుడి గమనం లేని మాసంలో శుభకర్యాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనం వంటివి చేయరాదని చెప్పారు. లక్ష్మి నారాయణుడి కి పూజలు చేస్తే మంచిదని ఈ అధికమాసం లో విష్ణువుకి పూజ చేస్తే మనం ఏది కోరుకుంటామో అది అధికంగానే లభిస్తుందని తెలిపారు.