Allu Arjun: బావా అంటూ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్… ఆనందంలో అభిమానులు..?

0
15

Allu Arjun: తాజాగా మే 20న జూనియర్ ఎన్టీఆర్ 40 వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ క్రమంలో ” హ్యాపీ బర్త్ డే బావ.. హాప్ యు హ్యావ్ ఎ బ్లడీ గుడ్ బర్త్ డే” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. గతంలో బన్నీ బర్త్ డే రోజున ఎన్టీఆర్ స్పెషల్ విషెస్ తెలియజేశాడు.

ఇక ఇప్పుడు బన్నీ కూడా ఎన్టీఆర్ కి స్పెషల్ విశేష్ తెలపడంతో అటు తారక్ అభిమానులతో పాటు బన్నీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి వెకేషన్ కి వెళ్లిన్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా టైటిల్ కూడా ఖరారు చేశారు.


Allu Arjun: బావా అంటూ సంబోధించు బన్నీ..


యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘ దేవర ‘ అనే టైటిల్ ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ పోస్టర్ చూసిన అభిమానులకు సినిమా మీద అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.