Analist Damu Balaji : తనను తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకున్న రాజశేఖరన్ ఉరఫ్ నిత్యానందస్వామి కొత్తగా ఒక దేశాన్నే పెట్టిన సంగతి మనకు తెలిసిందే. లైంగిక ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న నిత్యానంద దేశాన్ని వదిలి పారిపోయాడు. ప్రస్తుతం ఈక్వెడార్ దగ్గర ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి కైలాస దేశంగా నామకరణం చేసి స్వాతంత్ర దేశంగా ప్రచారం చేసాడు. సొంత కరెన్సీ, సెంట్రల్ బ్యాంకు అలాగే ఆ దేశానికి వెళ్లాలంటే వీసా వంటి అనుమతులు అన్నీ ఉన్నాయి. ఇదంతా కరోనాకి ముందు సంగతి అయినా ఇపుడు మళ్ళీ నిత్యానంద అతని కైలాస దేశం వార్తల్లోకి నిలవడానికి కారణం ఉంది. అదే అంతర్జాతీయ సదస్సులో ఆ దేశ ప్రతినిది పాల్గొనడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నిత్యానంద అసలు ఉన్నాడా…
యూఎన్ఓ, జెనివా లో జరిగిన సుస్థిరాభివృద్ధి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఫిబ్రవరి 24వ తేదీన చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ చర్చలో తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధిని అంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళ పాల్గొన్నారు. ఆమె ఆ సదస్సులో మాట్లాడుతూ వాళ్ళ దేశంలో పౌరులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెబుతూనే నిత్యానందను ఇండియా ఇబ్బందులకు గురించేస్తోంది అంటూ మాట్లాడారు. ఈ విషయం గురించి దాము బాలాజీ మాట్లాడుతూ ఆమె మాట్లాడిన విషయాలు సంబంధం లేనివిగా ఉండటం వలన యూఎన్ఓ రికార్డుల నుండి తొలగించింది.

కానీ నిత్యానందకు ఏదో వ్యాధి సోకిందని అతను మరణించాడు అనే పుకార్లు 2019 సమయంలో బాగా వినిపించాయి. కేవలం ఫండ్స్ కోసం అతని శిష్యులు ఇలా నిత్యానంద బ్రతికే ఉన్నాడనే ప్రచారం చేస్తున్నారు అనే పుకార్లు ఉన్నాయంటూ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు. నిజానికి 2019 తరువాత నిత్యానంద ప్రత్యక్షంగా కనిపించింది లేదు. అతని ముందు వీడియోలు మాత్రమే నెట్ లో కనిపిస్తున్నాయి కానీ కైలాస దేశం పెట్టాక కూడా నిత్యానంద కనిపించలేదు అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.