Connect with us

Featured

Analyst Damu Balaji : తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డి బయోగ్రఫీ.. ప్రేమ, పెళ్లి.. రేవంత్ రెడ్డి నుండి రేవంతన్న వరకు ఆయన ప్రస్థానం…: అనలిస్ట్ దాము బాలజీ

Published

on

Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికలు ముగిసాయి… గెలుస్తామన్న ధీమాతో ముందస్తుకు వెళ్లిన కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆలోచనలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్లకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగా సీఎం రేస్ లో అందరి నోటా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. నిజానికి ఎన్నికలకు మూడు నెల్లముందు కూడా బిఆర్ఎస్, రెండో స్థానంలో బీజేపీ ఉండగా మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా గెలవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కాబోతున్న తరుణం ఆయన జీవితం, సీఎంగా ఆయన ఎదిగిన తీరు అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

విద్యార్ధి రాజకీయాల నుండి నేడు సీఎం పదవి వరకు…

1969 లో మహబూబ్ నగర్ కొండారెడ్డి గ్రామంలో జన్మించిన అనుముల రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఏబివిపి విద్యార్థి సంఘంలో ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ లో కూడా ఉన్నారు. అయితే చదువుయ్యాక అందరూ బీజేపీ పార్టీ వైపు వెళ్తారనుకుంటే ఎన్టీఆర్ మీద అభిమానము, అలాగే చంద్రబాబు మీద అభిమానంతో 2005లో ఆయన టీడీపీ పార్టీలోకి చేరి అధిష్టానం వద్దని చెప్పినా మేడ్చల్ మండలం జెడ్పిటిసి మెంబెర్ గా గెలిచారు. ఆపైన 2009 ఎమ్మెల్సిగా గెలుపొందిన ఆయన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కి ప్రియ శిష్యుడిగా మారాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తెలంగాణ విడిపోయాక 2017లో కాంగ్రెస్ చేరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురిలో ఒక్కడిగా ఎన్నికయ్యడు.

Advertisement

2018 లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన మల్కాజిగిరి నుండి ఎంపి గా గెలిచారు. ఇక తాజాగా తెలంగాణ ఎన్నికలలో ఆయన గెలవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి బాలాజీ మాట్లాడుతూ ఆయన ఇంటర్ చదివే సమయంలోనే గీత అనే అమ్మాయిని ప్రేమించగా ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతురు కాగా డిగ్రీ చదివే సమయంలో వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి గీతను ఢిల్లీలో చదివించారు. అయితే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా జైపాల్ రెడ్డి గారి వద్దకే వెళ్లి తమ ప్రేమ వ్యవహారం చెప్పడంతో ఆయన ముక్కుసూటి తనం, ధైర్యం నచ్చి రాజకీయాల్లో ఖచ్చితంగా రానిస్తాడనే నమ్మకం కలిగి తమ్ముడికి చెప్పి పెళ్లి చేసారు. అలా రేవంత్ రెడ్డి గారు కష్టపడి తన లవ్ లైఫ్ అలాగే పొలిటికల్ లైఫ్ లోనూ సక్సెస్ అయ్యారు. ఇక ఆయన ఓటుకు నోటు కేసు సమయములో చంద్రబాబు పేరు చెబితే ఆయన సేఫ్ అవుతాడని తెలిసినా నిబద్దతతో వ్యవహరించి చంద్రబాబు ప్రియ శిష్యుడిగా మరోసారి రుజువు చేసుకున్నాడు. నిజానికి ఓటుకి నోటు కేసు ద్వారానే రేవంత్ కి మరింత ప్రాచుర్యం లభించింది అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాజకీయనాయకులలో కెసిఆర్ ను ధైర్యంగా తన మాటలతో ఢీ కొట్టగల నాయకుడు రేవంత్ మాత్రమే. ఇక ఆయన స్పీచ్ లతో తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డి కాస్తా రేవంతన్నగా ఆదరణ చూరగున్నారు అంటూ బాలాజీ రేవంత్ రెడ్డి గారి జీవితం గురించి వివరించారు.

Continue Reading
Advertisement

Featured

Sreemukhi: వయసు పెరుగుతుంది … ప్రెజర్ పెరుగుతుందంటూ పెళ్లి పై ఓపెన్ అయిన శ్రీముఖి?

Published

on

Sreemukhi: శ్రీముఖి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీముఖి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి శ్రీముఖి పెళ్లి వయసు కూడా దాటిపోతుంది.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈమె పెళ్లి గురించి ఎన్నోసార్లు తనని ప్రశ్నిస్తూ వచ్చారు. తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా ఈమెకు మరోసారి పెళ్లి ప్రశ్న ఎదురయింది. పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారనే ప్రశ్న శ్రీముఖికి ఎదురు కావడంతో ఈమె ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.

నాకు వయసు పెరుగుతూనే ఉంది పెళ్లి ప్రశ్నలు కూడా తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే మా కుటుంబం నుంచి నాకు ప్రెజర్ ఉందని చాలామంది భావిస్తున్నారు. మా కుటుంబంలో నా పెళ్ళికి ఏ విధమైనటువంటి ప్రెజర్ లేదని శ్రీముఖి తెలిపారు. ప్రస్తుతం నేను కెరియర్ పరంగా చాలా బిజీగా గడుపుతున్నాను. నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఇదే విషయం చెబుతున్నారు. నువ్వు నీ వృత్తిలో ముందుకు పయనిస్తూ ఉండు నీకు పెళ్లి చేసుకోవాలన్నప్పుడే చేసుకో అంటూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపారు.

Advertisement

లౌడ్ స్పీకర్…
ప్రస్తుతం నేను మంచి మంచి షోస్ చేస్తున్నానని ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేవని శ్రీముఖి తెలియజేశారు. ఇక నేను మాట్లాడితే అందరూ నన్ను లౌడ్ స్పీకర్ అంటారు. ఒకవేళ నా పెళ్లి కనుక సెట్ అయితే నేనే లౌడ్ స్పీకర్ లాగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తాను అంటూ శ్రీముఖి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Chiranjeevi: వామ్మో చిరంజీవి కట్టుకున్న వాచ్ ధర అన్ని లక్షలా.. చూడటానికి సింపుల్ గానే ఉందే!

Published

on

Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి అయ్యి ఉంటాయి. వాళ్లు వేసుకుని షూ నుంచి మొదలుకొని తిరిగే కార్లు ఉండే ఇల్లు వరకు చాలా ఖరీదైనవే ఉంటాయి. ఇక సెలబ్రిటీలు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు స్పెషల్ గా కనిపిస్తే వారి చెప్పుల నుంచి మొదలుకొని డ్రెస్ వాచ్ ధరల గురించి పెద్ద ఎత్తున అభిమానులు సెర్చ్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి వాచ్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. ఈ వేడుకకు చిరంజీవి చాలా సింపుల్ లుక్ లో కనిపించారు.

ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి చాలా సింపుల్ గా వచ్చినప్పటికీ ఈయన చేతి వాచ్ మాత్రం అందరిని ఆకర్షించింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు ఎంత అసలు అది ఏ బ్రాండ్ కు సంబంధించినది అనే విషయాల గురించి అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

Advertisement

అరకోటి రూపాయలు..
ఈ కార్యక్రమంలో చిరంజీవి చేతికి కట్టుకున్నటువంటి వాచ్ ఏ లాంజ్ అండ్ స్నోహే అనే బ్రిటిష్ కంపెనీకి సంబంధించినటువంటి వాచ్ ధరించారు అయితే ఈ వాచ్ ధర ఏకంగా 50,56,747 రూపాయలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దాదాపు అరకోటి రూపాయలు ఖర్చు చేసి ఈ వాచ్ ను కొనుగోలు చేశారనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సామాన్య ప్రజలకు ఇది చాలా పెద్ద విషయమైనప్పటికీ సెలెబ్రెటీలకు మాత్రం ఇది చాలా సింపుల్ విషయాలు అని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Varun Tej: సినిమా కోసం రెండు సార్లు పెళ్ళి వాయిదా వేసుకున్న వరుణ్..గ్రేట్ అంటూ?

Published

on

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారు.

ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నటువంటి  ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది నవంబరు ఒకటవ తేదీ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ గత ఏడాది జూన్ 20వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్నారు. నిశ్చితార్థం తర్వాత తన కుటుంబ సభ్యులు రెండుసార్లు పెళ్లికి ముహూర్తం పెట్టినప్పటికీ వరుణ్ తేజ్ పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

Advertisement

ఆపరేషన్ వాలెంటైన్..
ఈ విధంగా వీరిద్దరూ పెళ్లిని వాయిదా వేసుకోవడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.ఆపరేషన్ వాలంటైన్ సినిమా షూటింగ్ మధ్యలో పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించారట అయితే పెళ్లి పనులలో బిజీగా ఉండడంతో సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని అంతేకాకుండా తాను పూర్తిగా డిస్టర్బ్ అవుతాను అన్న ఉద్దేశంతో వరుణ్ తేజ్ రెండుసార్లు పెళ్లిని వాయిదా వేసుకుని సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నవంబర్లోనే పెళ్లి చేసుకున్నారట. ఈ విషయం తెలిసిన మెగా ఫాన్స్ డెడికేషన్ అంటే ఇదే కదా అంటూ వరుణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!