బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈమె కెరీర్ ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది.. కానీ ఈ బొద్దుగుమ్మ సరైన సమయంలో అవకాశాలను వినియోగించుకొని ఉంటే.. విజయశాంతి అన్నట్లు జూనియర్ రాములమ్మ స్థాయికి వెళ్ళేది. కానీ, ఏం చేస్తాం, ఈ భారీ బ్యూటీకి కాలం కలిసి వచ్చినా, ఆమె బద్ధకం ఆమెకు స్టార్ హీరోయిన్ ను కానివ్వలేదు.

మొత్తమ్మీద హీరోయిన్ గా ఎదగాల్సిన శ్రీముఖి, ప్రోగ్రామ్ యాంకర్ గానే మిగిలిపోయింది.ఇక శ్రీముఖి లైఫ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తెలుసుకోవాలని తెగ ఉత్సాహపడుతుంటారు ఆమె ఫ్యాన్స్. శ్రీముఖి చేస్తున్న కార్యక్రమాలతో పాటు, ఆమె నటిస్తోన్న సినిమాల్ని అలాగే ఆమె పర్సనల్ లైఫ్ లో జరిగిన కొత్త సంఘటనలను తెలుసుకుంటూ శ్రీముఖిని ఫాలో అవుతూ అమ్మడికి సోషల్ మీడియాలో నిత్యం టచ్ లో ఉంటుంటారు ఆమె ఫ్యాన్స్.

ఇక తన ఫాలోవర్స్ తో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకునే అలవాటు ఉన్న శ్రీముఖి, వారితో అన్ని ఓపెన్ గానే డిస్కస్ చేస్తూ ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఆ విధంగా ముందుకు పోతుంది. అయితే, ప్రస్తుతం ఆమె అభిమానులందరూ ఆమెను అడుగుతోన్న ఏకైక ప్రశ్న. పెళ్లి ఎప్పుడు అని ? ఎలాగూ కరోనా టైమ్ లో సెలబ్రిటీలు అంతా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు.

అలాగే శ్రీముఖి కూడా పెళ్లి చేసుకుంటుందేమో అని ఆమె పెళ్ళికి సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు అందరూ. కానీ శ్రీముఖి మాత్రం ఇప్పట్లో పెళ్లి అనే కాన్సెప్ట్ తన జీవితంలో లేదు అంటోంది. దయచేసి పెళ్లి ఎప్పుడు అంటూ నన్ను అడగొద్దు ప్లీజ్ అంటూ సరదాగా నవ్వుతూ ఉన్న ఫన్నీ ఎమోజీలను పెడుతూ టైమ్ పాస్ చేస్తోంది. మరి ఇంతకీ శ్రీముఖి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందోనని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here