Parking Fee: సాధారణంగా షాపింగ్ మాల్స్ నిర్వహించే వారు వినియోగదారులకు పార్కింగ్ ప్లేస్ ను కూడా అలాట్ చేస్తుంటారు. ఇది వారి బాధ్యత. అయితే ఈ పార్కింగ్ ప్లేస్ కు సదరు మాల్స్ వారు ఫీజు వసూలు చేస్తే… సరిగ్గా ఇదే విషయంపై కేరళలో ఓ వ్యక్తి హైకోర్ట్ ను ఆదేశించాడు.

దీంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్ చేస్తే మాల్స్‌కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్ పేర్కొన్నారు.

కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది. నిజానికి బిల్డింగ్ రూల్స్ ప్రకారం… పార్కింగ్ స్థలంలో కూడా బిల్డింగ్ నిర్మాణంలో భాగంగానే ఉంటుందని.. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది.
ఫీజును రూ. 20 వసూలు చేసినందుకు..
కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్ తమ సొంత రిస్క్ తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఇటీవల వడక్కన్ అనే వ్యక్తి డిసెంబర్ 2న లులు మాల్ ను వెళ్లినప్పుడు అతని నుంచి పార్కింగ్ ఫీజును రూ. 20 వసూలు చేసినందుకు హైకోర్ట్ ను ఆశ్రయించారు. తన నుంచి పార్కింగ్ వసూలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. ఆయన అందుకు నిరాకరించారు. దీంతో మాల్ ఎగ్జిట్ గేట్ లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈమేరకు కోర్ట్ ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
In order to enhance the safety of the occupants in motor vehicles carrying upto 8 passengers, I have now approved a Draft GSR Notification to make a minimum of 6 Airbags compulsory. #RoadSafety #SadakSurakshaJeevanRaksha
— Nitin Gadkari (@nitin_gadkari) January 14, 2022































