Astrologer Venu Swamy : మెజారిటీ తగ్గొచ్చేమో కానీ సీటు మాత్రం ఆయనదే…: ఆస్ట్రాలజర్ వేణు స్వామి

0
152

Astrologer Venu Swamy : జాతకాలను నమ్మే వారు ఉంటారు, కొంతమంది అందంతా ట్రాష్ అంటూ తీసి పడేసేవారూ ఉంటారు. అయితే బాగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఎంత కస్టపడినా ఫలితం కనిపించినపుడు జాతకాల వైపు జనాలు మల్లుతారు. అలా వచ్చిన వారిని క్యాష్ చేసుకోవడం చాలా మంది జోతిష్యులు చేసే పని. అయితే కొంత మంది మాత్రం సెలబ్రిటీలు, రాజకీయనాయకుల జాతకాలను చెబుతూ వైరల్ అవుతుంటారు. అలాంటి వారిలో వేణు స్వామి అనే ఆస్ట్రాలజర్ ఒకరు. ప్రభాస్ కు శని ఉందని ఏ సినిమా ఎలా తీసినా హిట్ కాదంటూ చెప్పిన వేణు స్వామి ఇక పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకుంటాడని అలానే ఆయన అన్న కూతురు శ్రీజ కూడా మూడో పెళ్లి చేసుకుంటుందంటూ హాట్ కామెంట్స్ చేసారు. తనని తాను ప్రమోట్ చేసుకోడానికి సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి రాజకీయ నాయకుల జాతకాల గురించి మాట్లాడారు.

ఏపీ లో ఆయనే సీఎం…

రాజకీయాల గురించి వేణు స్వామి చెబుతూ తెలంగాణ సీఎం కెసిఆర్ గురించి ఇపుడే అంచనాలు వేయలేము కానీ ఏపీ లో మళ్ళీ జగన్ దే అధికారం అంటూ చెప్పారు. మెజారిటీ తగ్గొచ్చేమో కానీ ఆయనే మళ్ళీ సీఎం అవుతారు అంటూ జోష్యం చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ మీద కాస్త ఒత్తిడి పడుతుందేమో కానీ జనసేన టీడీపీ మాత్రం కలిసి పోటీ చేస్తే జగన్ కి మెజారిటీ కూడా పెద్దగా తగ్గదు అంటూ చెప్పారు.

టీడీపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అయితే దానివల్ల టీడీపీ కి ప్రయోజనం ఉంటుంది కానీ జనసేన కి నాస్తే ఎక్కువ ఉంటుందంటూ చెప్పారు. అలా కాకుండా జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే జనసేన కు ప్రయోజనం ఉంటుంది అంటూ చెప్పారు. ఏది ఏమైనా జగన్ మళ్ళీ సీఎం అవుతాడంటూ చెప్పారు. ఇక కేంద్రంలో హంగ్ ఏర్పడవచ్చు అంటూ చెప్పి తెరాస కి బాగుంటుంది కానీ బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రభావం చూపదంటూ చెప్పారు.