Bairi Naresh : అయ్యప్ప భక్తులను క్షమాపణలు కొరడానికి సిద్ధంగా ఉన్నాను… కానీ…: బైరి నరేష్

0
138

Bairi Naresh : నాస్తికవాదిగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగ వైరల్ అవుతున్న వ్యక్తి బైరి నరేష్. అయ్యప్ప స్వాముల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బాగా వైరల్ అయ్యాడు. అయితే ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉంటానని కేవలం అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెబుతాను కానీ ఆ దేవుడికి కాదంటూ చెబుతారు నరేష్. దేవుడనే వాడు లేడని, మనిషికి మనిషి గౌరవం ఇచ్చుకోవలని, కులం-మతం అనేవి లేవంటూ ఆయన మాట్లాడుతారు. ఇటీవల ఒక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి అయ్యప్ప స్వామి, సాయి బాబా మీద వివాదాస్పద వ్యాఖ్యలను బైరి నరేష్ చేసారు. కానీ తాను మాట్లాడిన మాటలు తప్పని నిరూపిస్తే క్షమాపణలు చెబుతా అంటూ చెప్పారు.

అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెబుతా…

అయ్యప్పదీక్ష వేస్తే ఆ మాల వేసిన రోజులు అందరూ ఒకటే అన్నట్లుగా ఉంటారు. కులం మతం అనే బేధం ఉండదు. కానీ అలా అన్ని చోట్లా జరగదు, నేను ఎన్నో చోట్ల స్వామి మాల వేసిన ఒక మాదిగ మాల వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి పెద్ద కులం వాళ్ళు ఇష్టపడరు. మాల ధరించినంత మాత్రాన అందరూ సమానం అయిపోరు. అదే నేను చెప్పాలనుకున్నది. అయ్యప్ప మాల వేసినన్ని రాజులు నిష్టగా అందరూ సమానం అని కులాలకు అతీతంగా ఉండేవారందరూ నా దృష్టిలో గొప్పవారే.

అయితే వాళ్ళు ఆ దీక్ష సమయంలోనే ఎందుకు, మిగిలిన జీవితం మొత్తం అలా నియమ నిష్టలతో అందరినీ సమానంగా చూడవచ్చు కదా అనే నేను చెప్పాను. మన భారత రాజ్యాంగంలో ఎవరు ఏదైనా చేయవచ్చు. నా నమ్మకం నచ్చని వారు ఉంటారు అలాంటివారికి నా మాటలు నచ్చక పోతే నేను క్షమాపణ చెబుతాను కానీ అది దేవుడిని గుడ్డిగా నమ్మే వారికి కానీ దేవుడికి కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.