Character Artist Rupa Lakshmi : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవిని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ రూప లక్ష్మి గారు ఆ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది లాంటి విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

వేణు గారికి రెండు సార్లు ఫోన్ చేశా…
దిల్ రాజు గారి నిర్మాణంలో వచ్చిన బలగం సినిమా ఆడిషన్స్ అపుడు రూప గారికి దిల్ రాజు ఆఫీస్ నుండి ఫోన్ రాగా వేణు గారిని కలవమని అడిగితే వెళ్లి కనిపించారట రూప గారు. అయితే వేరే సినిమా షూటింగ్ నుండి అలాగే వెళ్లిపోవడంతో మేకప్ లో ఉన్న నేను ఆ పాత్రకు సరిపోనని భావించిన వేణు గారు ఏమీ మాట్లాడకుండా పంపేశారు అంటూ రూప గారు తెలిపారు.

ఇక మళ్ళీ ఒక రెండు సార్లు నేనే ఫోన్ చేసి నేను ఆ పాత్ర చేస్తానండి నేను చేయగలను అని చెప్తే ఎందుకు కన్విన్స్ అయ్యారో కానీ ఆ పాత్ర నాకిచ్చారు వేణు గారు. నేను చాలా గట్టిగా ఆ క్యారెక్టర్ నేనే చేయాలి అనుకున్నాను, అలాగే నేనే చేయాలని గట్టిగా అనుకున్నాను కాబట్టే చేసాను. ఆ క్యారెక్టర్ వల్ల మంచి పేరు వచ్చింది అంటూ చెప్పారు రూప లక్ష్మి. రూప లక్ష్మి అంతకు ముందు మహర్షి, వకీల్ సాబ్, క్రాక్ వంటి సినిమాల్లో నటించారు.