కోవిడ్ బాధితుల్లో ఆక్సిజన్ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా?

0
383

కరోనా రెండవ దశ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ సమయంలోనే బాధితులకు తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండవ దశ కరోనా వైరస్ లక్షణాలు గుర్తించేలోపే తీవ్రస్థాయిలో దాడి చేయడం వల్ల ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

రెండవ దశ కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తులలో ఉంటూ శ్వాసక్రియ పై ప్రభావం చూపిస్తుంది అనే విషయం మనకు తెలిసినదే. ఫలితంగా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలో తగ్గిపోయి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులలోకి చేరుకుని ఆక్సిజన్ గ్రహించే శక్తిని అడ్డుకుంటుంది. ఫలితంగా శరీరంలోని ఇతర భాగాలకు ఆక్సిజన్ సరఫరా కాదు. ఫలితంగా రక్తంలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా తగ్గిపోవటం వల్ల కరోనా బాధితుల్లో ఆక్సిజన్ సమస్య ఏర్పడుతుంది.

సాధారణంగా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు 94ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతకన్నా తక్కువగా ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించి వైద్యుల సూచనలు పాటించాలి. మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను ఆక్సి మీటర్ ద్వారా తెలుసుకోవచ్చు. రోజుకు మూడు నాలుగు సార్లు ఆక్సి మీటర్ ద్వారా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలిస్తూ ఉండాలి.మన శరీరానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందనే విషయాలు డాక్టర్లకు తెలుస్తాయి కనుక డాక్టర్ల పర్యవేక్షణలో ఆక్సిజన్ తీసుకుంటూ ఉండాలి.