లవర్ బాయ్ నితిన్ ఇప్పుడు మాంచి దూకుడు మీదున్నాడు..గత నెలలోనే చెక్ అనే ఓ డిఫరెంట్ జోనర్ మూవీతో మన ప్రేక్షకుల మిందు వచ్చిన ఈ హీరో.. ఇప్పుడు నెల గ్యాప్ లోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అయిపోయాడు.. అయితే ఈసారి ఎప్పటిలాగే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో రాబోతున్నాడు.. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జోడిగా నటించిన తాజా సినిమా రంగ్ దే.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 26 న విడుదల కానుంది..

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని రాజమహేంద్రవరం లోని బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది.ఇక ఈ రిలీజ్ ఈవెంట్ లో రంగ్ దే డైరెక్టర్ వెంకీ అట్లూరి మట్లాడుతూ..మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు సారీ చెప్పారు..ఇక ఈవెంట్లో భాగంగా డైరెక్టర్ మాట్లాడుతూ..రాజమండ్రికి నాకు అనుబంధం వుంది. ఫస్ట్ టైమ్ ఈవెంట్ ఇక్కడ జరగడం..చాలా ఆనందంగా వుంది. బేసిగ్గా లవ్‌స్టోరీసే చేయాలన్నది నా ఇంటెన్షన్ కాదు. జస్ట్ ఇది యాదృచ్ఛికంగా జరిగింది. రంగ్ దే అనేది ఇద్దరు వ్యక్తుల ప్రేమకథ మాత్రమే కాదు. రంగ్ దే అని పెట్టడానికి కారణం ఏంటంటే హోళీ ఆడితే రకరకాల కలర్లని ఒకేసారి ముఖం మీద కొడతాం. అలాగే ఈ సినిమాలో కూడా రకరకాల ఎమోషన్స్ ఒక స్ప్లాష్ కింద వస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతామో అంత చక్కగా వుంటుందీ సినిమా. ప్రామిస్‌గా చెబుతున్నాను.. నితిన్‌గారు కామెడీ నిజంగా అదరగొట్టేశారు. కీర్తిగారిని ఎంత ఏడిపిస్తారో.. తరువాత ఆమె అంత పగ తీర్చుకుంటారు. ఈవిడ మామూలు మనిషి కాదు. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది.

దేవిగారి విషయంలో తప్పు చేశాను. అందుకు అందరి ముందు పారీ చెబుతున్నాను. బస్టాండే.. బస్టాండే. పాట ఎంతో పెద్ద హిట్టయింది. అందరికి నచ్చింది. అయితే ఈ పాట ముందు విన్నప్పుడు సార్ ఇది అంటూ నసిగాను. వెంటనే దేవిగారు మీకు మైండ్ వుందా? అని తిట్టి ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఈ సాంగ్ పెడదాం అని నన్ను కన్విన్స్ చేశారు..కానీ దేవి గారు అన్నట్టు ఈ పాట రిలీజ్ అయిన దగ్గర్నుంచి సూపర్ డూపర్ హిట్ అయ్యింది..అందుకే ఆ రోజు నేను వద్దు అని అన్నందుకు ఇప్పుడు సారి చెప్తున్నాను అంటూ అదే వేదికపై ఉన్న దేవిశ్రీప్రసాద్ కి సారీ చెప్పాడు దర్శకుడు..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here