Connect with us

Featured

Disco Shanthi: నయనతార వస్త్రధారణపై నటి డిస్కో శాంతి బోల్డ్ కామెంట్స్.. చూడటానికే అసహ్యం అంటూ?

Published

on

Disco Shanthi: ప్రస్తుతం ఉన్న ఈ సినిమా ప్రపంచంలో ముందుకు సాగాలంటే నటనతో పాటు గ్లామర్ కూడా ముఖ్యమైనదని భావిస్తారు. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున నటిమనులు విభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు కొంతమంది నటిమనుల వస్త్రధారణ పై ఎన్నో విమర్శలు వెల్లు వెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై సీనియర్ నటి డిస్కో శాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కొంతమంది నటీమణులు ఎలాంటి వస్తు ధారణ వేసుకున్నప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తారు. అలాగే మరికొందరు ఒళ్ళు కనపడకుండా నిండుగా చీర కట్టుకున్నా అంద విహీనంగానే కనిపిస్తారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోని ఈమె నయనతార గురించి మాట్లాడుతూ ఆమె వస్త్రధారణ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

నయనతార శ్రీరామరాజ్యం సినిమాలో నిండుగా చీర కట్టుకొని ఎంతో అందంగా కనిపించారు. అలాగే బిల్లా సినిమాలో బికినీ ధరించి స్కిన్ షో చేసిన అందంగా ఉన్నారు. ఇలా నయనతార ఎలాంటి దుస్తులు ధరించిన చాలా అందంగా ఉంటారని ఆమె డ్రెస్ సెలక్షన్ చాలా బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా డిస్కో శాంతి నయనతార వస్త్రధారణ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

Disco Shanthi:  ఎలాంటి దుస్తులు వేసుకున్నాం అనేది ముఖ్యం కాదు…

ఈ విధంగా ఈమె వస్త్రధారణ గురించి మాట్లాడుతూ మనం ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు ఆ దుస్తులు మనకు ఎలా ఉన్నాయనేది ముఖ్యమని తెలిపారు మరికొందరు స్కిన్ టైట్ డ్రెస్సులు ధరించి చూడటానికే ఎంతో అసహ్యంగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారని,మరికొందరు ఎక్స్పోజ్ చేసినా కూడా పెద్దగా బాగుండారంటూ ఈ సందర్భంగా ఈమె హీరోయిన్ల వస్త్రధారణ పై తన అభిప్రాయాలను తెలియజేశారు.

Featured

Nag Aswin: నాగ్ అశ్విన్ కి ఆ హీరోయిన్ అంటే అంత సెంటిమెంట్ నా.. ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ?

Published

on

Nag Aswin: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా కొనసాగుతున్న నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరుస అప్డేట్స్ విడుదల చేయడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు హిట్ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని తద్వారా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ నాగార్జునకు ఒక హీరోయిన్ అలాగే ఒక హీరో హిట్ సెంటిమెంట్ గా మారారని అందుకే తన సినిమాలలో వీరిద్దరిని కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నారంటే తప్పనిసరిగా విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ వీరిద్దరూ ఉండేలా ఈయన జాగ్రత్త పడుతున్నారట. నాగ్ అశ్విన్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి కల్కి ఈ మూడు సినిమాలలో వీరిద్దరూ నటించారు నటించిన ఇదివరకు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి అందుకే ఈ కల్కి సినిమాలో కూడా విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయర్ ఉండేలా అశ్విన్ జాగ్రత్త పడ్డారు.

Advertisement

విజయ్ దేవరకొండ.. మాళవిక నాయర్..
ఈ హిట్ సెంటిమెంట్ ప్రకారం ఈయన కల్కి సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకోబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు కానీ ఈ సినిమాకు మాత్రం ఫ్రీ బుకింగ్స్ భారీగా జరగడంతో సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో పవన్ … అందుకే దీక్ష వేశారా?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో బాధ్యతలను తీసుకొని పెద్ద ఎత్తున అధికారులతో సమావేశాలు సమీక్షలను నిర్వహిస్తూ అన్ని శాఖలపై ఆరా తీయడమే కాకుండా అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను క్షణాలలోని పరిష్కరిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా అయిన పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్ష వేశారు. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో ఈ దీక్ష గురించి పెద్ద ఎత్తున అందరూ తెలుసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకోవడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజులపాటు వేయబోతున్నారు.

Advertisement

11 రోజుల దీక్ష..
ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకాకుండా కేవలం పండ్లు, ద్రవాలను మాత్రమే తీసుకోబోతున్నారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే ఎన్నికలలో తన విజయం కోసమే ఈయన అమ్మవారికి మొక్కుకున్నారని అయితే ఎన్నికలలో విజయం సాధించడంతో అమ్మవారి మొక్కు తీర్చడం కోసం ఇలా దీక్ష వేశారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Puri Jagannadh: పూరి జగన్నాథ్ కు పోకిరి కంటే ఆ సినిమా డైలాగ్స్ అంటే అంత ఇష్టమా?

Published

on

Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా ఈయన డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వాళ్ళే.

ఇక పూరి జగన్నాథ్ సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి ఈయన సినిమాలలో హీరోలకు ఇచ్చే ఎలివేషన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈయన సినిమాలలో హీరోలు అందరూ కూడా కాస్త పొగరుగా ఉండేలాగే చూపిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలలో డైలాగ్స్ కూడా భారీ స్థాయిలో పేలుతూ ఉంటాయి. ఇక ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈయన డైరెక్షన్ చేసిన సినిమాలలో పోకిరి సినిమా మరో లెవల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఆయన చెప్పిన డైలాగ్స్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకు పెద్దగా ఇష్టం లేదని పూరి ఓ సందర్భంలో వెల్లడించారు. తనకు పోకిరి సినిమా కంటే బిజినెస్ మాన్ సినిమాలో డైలాగ్స్ అంటే చాలా ఇష్టమని ఈయన తెలిపారు.

Advertisement

బిజినెస్ మాన్..
ఈ సినిమాలో నన్ను కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా అని చెప్పే డైలాగ్స్, ముంబైకి ఉచ్చ పోయించడానికి వచ్చా అంటూ డైలాగ్స్ బారి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అయితే ఈ సినిమాలో డైలాగ్స్ అంటేనే తనకు ఇష్టం అంటూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పూరి విషయానికొస్తే ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!