సరిగ్గా మూడు దశాబ్దాల కిందట రిలీజై తెలుగు సినిమా ఒరవడిని కొత్త పుంతలు తొక్కించిన చిత్రం శివ. ‘శివ’ అనే ఒకే ఒక్క సినిమా లేకపోయుంటే.? ఒక్కసారి ఆలోచించండి …ఈ 30 ఏళ్లలో తెలుగు సినిమా ఎలా ఉండేదో!?! ఊహించడానికే ఇబ్బంది గా ఉంది కదూ! నిజంగానే అప్పట్లో అలా ‘శివ’ తాండవం జరక్కపోయింటే ఇన్ని మలుపులు ,ఇన్ని గెలుపులు,ఇన్ని మెరుపులు చూసుండేవాళ్ళం కాదేమో! అప్పటివరకూ కొత్త కుర్రాళ్ళకి దర్శకత్వం ఇవ్వాలంటే భయపడే తెలుగు నిర్మాతలకి ధైర్యం పెరిగింది. ఎందరో కొత్త దర్శకులకి అవకాశాలు పెరిగాయి. కొత్త మార్పులొచ్చాయి. కథాపరంగా, సాంకేతిక విలువల పరంగా శివ చిత్రం ఓ ట్రెండ్ సెట్ చేసింది.

ఆ సినిమాలో నటించిన నాగార్జున ఇమేజ్ అమాంతం పెరిగిపోగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రంతోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ చిత్రం ఆరోజుల్లో ఎంత సంచలన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.! అయితే చాలామందికి తెలియని విషయమేమిటంటే ఈ చిత్రంలో మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా కాలేజీ స్టూడెంట్ గా నటించాడు. ఈ సినిమాలో ‘బోటనీ పాఠముంది… మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా’ అనే సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది. ఇందులో పూరి జగన్నాథ్ కూడా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ… “బ్లూ షర్ట్ లో కనిపించే నాటి జూనియర్ ఆర్టిస్ట్… నేటి సూపర్ డైరెక్టర్ పూరి జగన్..‘హేయ్ పూరి… వాట్ ఏ జర్నీ’” అంటూ కితాబిచ్చారు.

ఆ ఫొటోలో హీరో నాగార్జున వెనుక పూరీ జగన్నాథ్ నిలబడి ఉండడం చూడొచ్చు. ఇప్పుడు తన తనయుడు ఆకాశ్ ఎలా ఉన్నాడో నాడు పూరీ అలాగున్నాడు. ఈ ట్వీట్ కు స్పందించిన పూరి జగన్నాథ్… “యస్ సార్.. అంతా మీ దయ వల్లే” అంటూ వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేశాడు. మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా వ‌ర్మ స్కూల్ నుండే టాలీవుడ్ లోకి వ‌చ్చాడు మ‌రి.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here