ముల్లంగిని ఆ ఆహార పదార్దాలతో కలిపి తింటే విషం తిన్నట్లేనట?

0
152

సాధారణంగా దుంపలలో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ముల్లంగిలో ఎక్కువ మొత్తం పోషకాలు ఉండటం వల్ల ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ క్రమంలోనే ముల్లంగిని వివిధ రకాల ఆహార పదార్థాలలోను, సలాడ్ల రూపంలోనూ తీసుకుంటారు. ముల్లంగిలో ఎక్కువ భాగం ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఆంథోసైనిన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా వీటిలో అధికభాగం యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మూత్రపిండ ఉదర సమస్యల నుంచి విముక్తి కల్పించడంలో ముల్లంగి దోహదపడుతుంది.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలు కలిగి ఉన్న ముల్లంగిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ఆహారం విషంగా మారి వాంతులు, వికారం వంటి సమస్యలు ఏర్పడతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ముల్లంగిని ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

కీర దోసకాయ: చాలామంది ముల్లంగి సలాడ్లను తయారు చేసుకునే సమయంలో ముల్లంగితో పాటు కీరదోసకాయను ఉపయోగిస్తుంటారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవటం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ఈ రెండింటి మధ్య సుమారు 10 గంటల పాటు వ్యత్యాసం ఉండాలని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

నారింజ: ముల్లంగి తిన్న వెంటనే నారింజ తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం విషయంగా మారుతుంది.అదేవిధంగా మన జీర్ణక్రియలో కూడా తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి కనుక ముల్లంగి తిన్న వెంటనే నారింజ తినకూడదు.

పాలు: ముల్లంగి తీసుకున్న వెంటనే పాలు లేదా పాల పదార్థాలను తీసుకోకూడదు.ఈ రెండు పదార్ధాలు వేర్వేరు స్వభావం కలిగి ఉండటం వల్ల ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఉదర సమస్యలు తలెత్తుతాయి కనుక ఈ రెండింటి మధ్య కనీసం నాలుగు గంటల వ్యత్యాసము ఉండాలి.

కాకరకాయ: కాకరకాయ ముల్లంగి రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు, గుండెపోటు వంటి సమస్యలు కలుగుతాయి కనుక ముల్లంగి తిన్న 24 గంటల వరకు కాకరకాయ తినకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here