Fans worried about super star Krishna : సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో కౌ బాయ్ సినిమాల ద్వారా ట్రెండ్ సెట్ చేసారు. కృష్ణ గారు తెలుగు సినిమాల్లో కౌ బాయ్ గా కనువిందు చేశారు. ఇంకా గూడచారి గా అనేక యాక్షన్ సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు తనదైన శైలిలో నటించి మెప్పించారు . అప్పటి హీరోల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో కృష్ణ గారికి ఉన్న అభిమాన సంఘాలు మరి ఏ హీరోకు లేవంటే అతిశయోక్తి కాదేమో. ఇక అల్లూరి సీతారామరాజు అంటే మనకు గుర్తొచ్చేది కేవలం సూపర్ స్టారే.

సూపర్ స్టార్ ఆరోగ్యం గురించి అభిమానుల ఆందోళన….
వయసు మీద పడటం, కరోనా కారణంగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంటికే పరిమితమయ్యారు. చాలా అరుదుగా మీడియా ముందుకు వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడ బయట కనిపించలేదు. ఇటీవల కాలంలో వారి ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొన్న సూపర్ స్టార్ కృష్ణ గారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారి మొహం చూసిన అభిమానులు ఆయన అనారోగ్యంతో ఉన్నారని ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ ఫోటోలను సూపర్ స్టార్ గారి కూతురు మంజుల సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక అభిమానుల ఆందోళనతో సూపర్ స్టార్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చారు.

ఫ్యామిలీ ఫంక్షన్ లో కృష్ణ గారు ఇన్విజిబుల్ మాస్క్ ధరించారని, అతడి ముఖంలో కలిసిపోయి కనిపించడం వల్ల ఫోటోలలో ఆయన ముఖం తేడాగా కనిపిస్తోందని క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం చాలా బాగుందని అభిమానులు ఆందోళన చందా వలసిన పని లేదని చెప్పారు. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.