మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

0
77

బంగారం కొనాలనే మహిళలకు ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. క్రమక్రమంగా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం కోసం ఎంతోమంది ఆసక్తి చూపిస్తూ బంగారం పై పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ వెనక్కి తీసుకోవడంతో క్రమంగా గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూనే వస్తుంది.

తాజాగా ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆభరణాలు తయారు చేయడం కోసం ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉంది. నిన్న మొన్న బంగారం ధరలు ఏ విధమైనటువంటి మార్పు కనిపించలేదు. అయితే ఎనిమిది గ్రాముల బంగారం ధర ధర ప్రస్తుతం రూ.35,040 ఉంది.గ్రాము కావాలంటే దాని ధర రూ.4,380 ఉంది.

పెట్టుబడుల కోసం ఉపయోగించే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780 గా ఉంది.8 గ్రాముల బంగారం ధర రూ.38,224 ఉంది. ఒక్క గ్రాము ధర రూ.4,778 ఉంది. ఇకపోతే వెండి ధరలు కూడా గత నెల రోజుల నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కిలో వెండి ధర రూ.72,800 ఉంది. నిన్న ధరలో మార్పు లేదు. ఆరు నెలల కిందట కిలో వెండి రూ.62,500 ఉండగా ఇప్పుడు రూ.72,800 ఉంది. అంటే కిలో వెండి గడిచిన ఆరు నెలలలో రూ.10,300 పెరిగిందిమహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here