Jayaprada: సీనియర్ నటిగా, మాజీ రాజ్యసభ సభ్యురాలిగా ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో సినిమాలలో చేయక పోయినప్పటికీ ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే జయప్రద ప్రస్తుతం బీజేపీ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన సినీ కెరీర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఎన్టీఆర్ గారు తన జీవితంలో ఒక రోల్ మోడల్ అని తెలిపారు.తనని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానని అతని స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి అతని నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని ఈమె తెలిపారు.Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు పార్టీలో చేరమని ఎన్టీఆర్ ఫోన్ చేసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తాను తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశానని, ఎలాంటి పదవులు ఆశించి తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని కేవలం ఎన్టీఆర్ గారిని సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమని జయప్రద తెలియజేశారు.
అయితే ఇలా రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారిని వదిలి ఇతర ఎమ్మెల్యేలు బలవంతం మీద ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మేము చంద్రబాబుతో ఏకీభవిస్తున్నామని చెప్పడంతో నేను ఎన్టీఆర్ గారిని వదిలి చంద్రబాబుకు మద్దతు తెలిపాను. అదే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.ఎన్టీఆర్ గారు నా పై ఎంతో విశ్వాసం ఉంచి తనని పార్టీలోకి ఆహ్వానించగా నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉండాల్సిన సమయంలో ఉండకుండా బయటకు వచ్చానని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.
ఇకపోతే చంద్రబాబునాయుడు సీఎం అయిన తర్వాత తాను రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో ఉన్నానని ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకు విలువ ఇవ్వడం అలాగే పార్టీ నేతలతో ప్రవర్తించే తీరులో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వకపోవడంతో నేను ఆంధ్ర వదిలి రావాల్సి వచ్చిందని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.
Rajamouli: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుందని చెప్పాలి. ఇలా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజమౌళి కెరియర్ లో వచ్చిన మగధీర సినిమా ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. మొదటిసారి ఇలాంటి సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు అయితే ఈ సినిమా సమయంలో తాను ఎంతో కంగారు పడ్డానని అప్పటికే ఇది చాలా భారీ బడ్జెట్ కావడంతో ఒక రకమైన భయం ఉండేదని తెలిపారు.
ఇక తన సినిమాలలో అందరిలాగే స్టార్ హీరోయిన్లనే పెట్టుకోవాలని నేను అనుకుంటాను. కానీ నేను రాసుకున్న కథకు అనుగుణంగా ఏ హీరోయిన్ అయితే సెట్ అవుతుందో వారినే తీసుకుంటాను. ఆ హీరోయిన్ కు వరుసగా ప్లాపులు వచ్చిన ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న తాను వాటిని లెక్క చేయను. మగధీర..
Advertisement
ఇలా ఆ హీరోయిన్ హిస్టరీ గురించి నేను ఏమాత్రం ఆలోచించనని నా పాత్రకు సూట్ అయితే తప్పనిసరిగా వారికి అవకాశాలు ఇస్తాను అంటూ ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది.
Venu Swamy: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ 8 కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా వేణు స్వామి సందడి చేయబోతున్నారనే సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం ఆగస్టులోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన లిస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో వేణు స్వామి కూడా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి బిగ్ బాస్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇలా ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి రాబోతున్నారని తెలియగానే ఈ కార్యక్రమం పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈయన కారణంగా రేటింగ్స్ కూడా భారీగా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటూ అందుకోబోయే రెమ్యూనరేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
లక్షల్లో రెమ్యునరేషన్..
Advertisement
దేశ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ తీసుకొని రెమ్యూనరేషన్ ఈయన అందుకోబోతున్నారని తెలుస్తోంది. వేణు స్వామి వారానికి లక్షల్లోనే రెమ్యూనరేషన్ అందుకునే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. మరి వేణు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ఆయన రెమ్యూనరేషన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు. ఈమె హైదరాబాదులో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసుకుంటూ జీవనం గడిపేది అయితే ఈమె చాలా తక్కువ ధరకే కడుపునిండా భోజనం పెట్టడంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్లి తనతో ఇంటర్వ్యూ తీసుకోవడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సెలబ్రిటీగా మారిపోయారని చెప్పాలి. ఎన్నో కార్యక్రమాలలో కూడా కుమారి ఆంటీ సందడి చేశారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.
ఈ విధంగా కుమారి ఆంటీ రోజురోజుకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకోవడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఆమె వద్దకు వచ్చి ఆమె ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు సినీ నటుడు సోను సూద్ వచ్చి ఒక్కసారిగా సర్ప్రైజ్ ఇచ్చారు. కుమారి ఆంటీని కలిసిన ఈయన ఆమెతో సరదాగా మాట్లాడి తన కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
మహిళా సాధికారత.. మహిళా సాధికారత కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని సోను సూద్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా తనకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే నాకు తెలియజేయాలి అంటూ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక సోను సూద్ గురించి కుమారి ఆంటీ మాట్లాడుతూ.. ఎంతోమందికి సహాయం చేసిన సోను సూద్ కి ఏమిచ్చినా తక్కువే అంటూ కుమారి ఆంటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.